ఓ మిత్రుడి కోసం చేసిన చిన్న సాయాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఓ పెద్ద ఫ్యామీలిలో చిచ్చు పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు సినిమాలో డైలాగులు ఉన్నాయని .. కాంటెక్ట్స్ లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తూ ఆ కుటుంబం మధ్య చిచ్చుకు చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం ఇదే వారికి మొదటి సారికాదు. ఎన్నో సార్లు చేశారు. చేసిన పాపం అనుభవిస్తున్నారు. అయినా తప్పు తెలుసుకోకుండా అదే పని చేస్తున్నారు.
స్నేహం కోసమే వెళ్లాడు పార్టీ కోసం కాదు !
స్నేహితుల కోసం తాను ఎక్కడికి అయినా వెళ్తానని హీరో ప్రకటించాడు. అంతే కానీ పార్టీ కోసం అని కాదు. కానీ తమ నాయకుడి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఆ హీరోను పిలిపించుకున్నాడు స్నేహితుడు.అయినా కలసి రాలేదు. ఇప్పుడు కూడా ఆయన తన స్నేహితుడు కోసమే వచ్చానని చెబుతున్నారు. కానీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం.. తమ కోసం వచ్చారని చెప్పుకుని బతికేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకు కేసి వారి కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు కొత్త కుట్రలు చేస్తున్నారు.
సింగిల్ సింహంకు కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అలవాటు
సింగిల్ సింహం అని చెప్పుకుంటూ ఉంటారు..కానీ చేసే పనులు మాత్రం వేరేగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లో చిచ్చు పెట్టాడనికి వందల కోట్లు ఖర్చు పెడుతూంటారు. ఇప్పుడూ అదే మిషన్ ప్రారంభించారు. ఇలా చిచ్చు పెట్టిన పాపాలు సింగిల్ సింహాన్ని బాగానే వెంటాడుతున్నాయి. ఇప్పటికే సర్వం కోల్పోయారు. మిగిలిన వాళ్లు కూడా ఛీ కొట్టాలని రాసి పెట్టి ఉందేమో కానీ.. ఆ పాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
హీరో బహిరంగంగా ఛీ కొడితే సరిపోతుందా ?
ఆయనకు స్నేహమే ముఖ్యం. రాజకీయాలకు సంబంధం లేదు. అంత మాత్రాన.. ఆయనను ట్రే కిట్ గ్రాంటెడ్ అన్నట్లుగా వాడేసుకుంటే ఆయన మాత్రం ఎందుకు ఊరుకుంటారు ?. ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. నేడో రేపో అది పూర్తయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన రీతిలో ఒకటి ఇస్తాడు. అపుడు తలెక్కడ పెట్టుకుంటారు ?