ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం ఉంది. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె భర్తకు కానీ.. పిల్లలకు కానీ సంబంధం లేదు. చాలా కాలం పాటు అణెరికాలో ఉండి తిరిగి వచ్చారు. ఆమె జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉందో కానీ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యని కూడా రాజకీయం చేశారు వైసీపీ నేతలు.
ఏపీ అటవీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే నేత… ఓ భూమి విషయంలో లోకేష్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని ట్వీట్ చేశారు. దానికి కొన్ని సర్వే నెంబర్లు కూడా పెట్టారు. కానీ ఈ ట్వీట్ పై వైసీపీ కార్యకర్తల్లోనే తీవ్ర అసహ్యం వ్యక్తమయింది. ఇంత దారుణమైన రాజకీయం అవసరమా అనిఆయనకే నేరుగా స్పందన తెలిపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పెట్టిన సర్వే నెంబర్లు కానీ.. అసలు భూమి కానీ లేదని కొంత మంది ఆన్ లైన్లో సెర్చే చేసి ఫ్రూప్‌లు పెట్టారు. లోకేష్ విషయంలో ఇనని తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతలకు వస్తున్నాయి.
అయితే ఇలాంటి ఛీత్కారాలను వైసీపీ నేతలు గొప్ప సర్టిఫికె్టలుగా భావిస్తున్నారు. అందుకే ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. తమదైన సైకో మైండ్ సెట్ ఉన్న వారు సమర్థిస్తారని వారు అనుకుంటున్నారేమో కానీ.. ఇతరులు అసహ్యించుకుంటారని అనుకోవడం లేదు. అధికారం మత్తులో మునిగి తేలుతున్న వారికి ఉచ్చనీఛాలు ఉండవని మరోసారి గుర్రంరెడ్డి నిరూపించారని టీడీపీ నతేలు విమర్శిస్తున్నారు.