ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు సిబ్బంది ఉన్నా… ఇంటికి వెళ్లి మీ డబ్బులు బ్యాంకుల్లో పడుతున్నాయని చెబుతున్నారు కానీ అలా వచ్చి డబ్బులు మాత్రం పంపిణీ చేయడం లేదు. దీంతో వృద్ధులు బ్యాంకులకు వెళ్లి ఎండలో నానా ఇబ్బందులు పడుతున్నారు.
వలంటీర్లు లేరని .. చంద్రబాబు వల్లే వారు లేరని అందులే డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్పుకునేందుకు వైసీపీ ఈ దారుణానికి పాల్పడుతోంది. కానీ సచివాలయ ఉద్యోగులు ఇంటికి వచ్చి పెన్షన్ గురించి చెప్పినప్పుడు ఎందుకు తెచ్చివ్వలేరన్న ప్రశ్న వారికి వస్తుందనే సంగతిని మర్చిపోయారు. అయినా తమ ఇబ్బందులకు ఎవరైనా అధికారంలో ఉన్న వారిని బూతులు తిట్టుకుంటారు కానీ ప్రతిపక్షంలో ఉన్న వారిని తిట్టుకుంటారా ? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారో కానీ.. పండుటాకుల్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందుతున్నారు.
కూలీ మీడియా టీవీ చానళ్లకు అదే పని . ఏ వృద్ధుడు ఎక్కడ చనిపోయాడో కనుక్కుని పెన్షన్ కోసం వెళ్లి చనిపోయాడని ప్రచారం చేస్తున్నాయి. ఓ వ్యక్తి చనిపోతే ఆ వార్త కోసం ఇంత ఈగర్ గా వెయిట్ చేసి వార్తలు వేయడం.. టీవీ చానళ్లకే చెల్లింది. వృద్ధుల్ని ఇలా ఇబ్బంది పెడితే ఎవరికి నష్టం జరుగుతుందో.. ఎన్నికల్లో తేలుతుంది కానీ.. పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ?