వైసీపీ నేతలు తాము ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలు, అక్రమాలు, దోపిడీల వ్యవహారంలో కేసులు నమోదు కాకుండా ఉండటానికి ..జైలుకు వెళ్లకుండా ఉండటానికి కొత్త టెక్నిక్ ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు మంచోడని భజన ప్రారంభిస్తున్నారు. కొంత మంది ఈ మాటల్ని సైలెంట్‌గా చెప్పి ఇంటలిజెన్స్ ద్వారా టీడీపీ హైకమాండ్ వద్దకు చేరేలా చేసుకుంటూంటే.. మరికొంత మంది బహిరంగంగా చెప్పుకుని కాకా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు మంచోడని పేర్ని నాని ప్రశంసలు
బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య ఏ వన్ గా ఉంది. ఆమెను అరెస్ట్ చేద్దామని ఓ మంత్రి చంద్రబాబు వద్దకు వెళ్తే.. ఆయన మహిళల్ని అరెస్టు చేయవద్దని చెప్పారని తెలిసిందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. తనను.. తన కుమారుడ్ని అరెస్టు చేసుకోమని చెప్పారు కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లవద్దన్నారని చంద్రబాబుకు గొప్ప సంస్కారం ఉందన్నారు. ఆయన మాటల్ని టీడీపీ సోషల్ మీడియా కూడా హైలెట్ చేస్తోంది. కానీ పేర్నికి చంద్రబాబులో ఈ సంస్కారం.. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడే.. చంద్రబాబు దయాదాక్షిణ్యాలు అవసరం అయినప్పుడే గుర్తుకు రావడం అసలు రాజకీయం.
ఇతర నేతలదీ అదే బాట !
పేర్ని బహిరంగంగా చెప్పారు కానీ వైసీపీ లోని చాలా మంది సీనియర్లు చంద్రబాబును పొగుడుతున్నారు. అంతర్గతంగా జగన్ రెడ్డి మూర్ఖుడని.. చంద్రబాబు స్టేట్స్‌మన్ అంటున్నారు. తాము ఇలా పొగుడుతున్న సంగతి టీడీపీ హైకమాండ్ వరకూ వెళ్లేలా తమకు ఉన్న యాక్సెస్ మార్గాలను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి అడ్డగోలుగా దొరికిపోవడానికి కావాల్సినన్ని ఆధారాలు ఉన్నా.. ఆయన ఇదే టెక్నిక్ తో ప్రస్తుతంగానికి నిమ్మళంగా ఉంటున్నారని అంటున్నారు . రాయలసీమకు చెందిన ఓ సీనియర్ మంత్రితో పాటు మరికొందరు నేతలు ఇదే పని చేస్తున్నారు. మీడియా ముందుకు రాకుండా.. తెర వెనుక చంద్రబాబును పొగుడుతూ బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు అధికారంలో లేకపోతే మంచివాడయ్యేవారా ?
చంద్రబాబు విషయంలో ఈ నేతల తీరు అత్యంత జుగుప్సాకరం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా కించపరచాలంటే అలా కించపరిచేవారు. ఆయన కుటుంబాన్ని వదిలేవారు కాదు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ పోయేవారు. చివరికి చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నా ఎగతాళి చేశారు. ఇప్పుడు తమ దొంగతనాలు, దోపిడీలు బయటపడతున్నాయని కాస్త గుడ్ లుక్స్ లో అయినా ఉంచుకుంటారని పొగుడుతున్నారు. ఇంత కన్నా వారి కన్నింగ్ రాజకీయాలకు సాక్ష్యం ఉండదు. ఇలాంటి వారితో వైసీపీ అధినేత కూడా రాజకీయాలు చేయలేరు.