వైసీపీ సోషల్ మీడియాకు ఫేక్ పిచ్చి పరాకాష్టకు చేరింది. పుష్ప సినిమాలో లేని డైలాగుల్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ.. అల్లు అర్జున్ పై కుట్ర చేస్తున్నారు. బాస్ కుటుంబంపై ఏదో అన్నారని.. పవన్ ను టార్గెట్ చేశారని రకరకాల డైలాగుల్ని తీసుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. నిజానికి సినిమాలో అసలు అలాంటి డైలాగులే లేవు. జపాన్ ఫైట్‌లో. మీ బాస్‌కి నేనే బాస్ అన్న డైలాగ్‌ని ఎన్ని రకాలుగా మార్చి ప్రచారం చేస్తున్నారో లెక్కే లేదు.
వైసీపీ సోషల్ మీడియా ఇంత ఫేక్ ప్రచారం చేసి ఏం సాధించాలని అనుకుంటుందో కానీ.. విషయం తెలిసిన వెంటనే తమపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఖాండిస్తారన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. సినిమాలో లేని డైలాగుల్ని ప్రచారం చేస్తూ.. అల్లు అర్జున్ చిరంజీవిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా ప్రచారం చేయడం వల్ల ఏమి వస్తుందో కానీ… తమ స్వార్థం కోసం ఓ హీరోను ఎంతకైనా వాడుకునేందుకు తెగిస్తామని మాత్రం నిరూపిస్తున్నారు.
పుష్ప సినిమాలో ఎలాంటి పొలిటికల్ డైలాగులు, ఇంటెన్షన్లు లేవు.. పెట్టాలని కూడా అనుకోలేదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే నిజంగా గాజు గ్లాస్ తో అర్జున్ చేసిన డాన్స్ జనసేనకు డైరక్ట్ గా సపోర్టు చేసినట్లే అవుతుంది. దాన్ని పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారో కానీ.. చివరికి వారు చెప్పే మాటల్ని వారు కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు.