ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.. వైసీపీ వైపు నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. టీడీపీకి పార్టీని అమ్మేశారని ఒకరు.. విలీనం చేసి ఉపాధ్యక్ష పదవి తీసుకోవచ్చు కదా అని ఇంకొకరు విమర్శించడం ప్రారంభించారు. అయితే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకనే ప్రశ్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. అంతగా బాధపడాలనుకుంటే.. జనసేన నేతలు బాధపడతారు.
పవన్ కల్యాణ్ పార్టీకి అరవై సీట్లు ఇస్తారని..డెభ్బై సీట్లు ఇస్తారని కూడా ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. పవన్ కల్యాణ్‌కు తక్కువ సీట్లు ఇచ్చారని.. వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ..పవన్ పై విమర్శలు చేయడం వెనుక ఉన్న కీలక అంశం.. పవన్ కల్యాణ్ ను అభిమానించే వారి ఓట్లను.. టీడీపీకి పడకుండా చేయడం. పొత్తుల్లో ఎవరికైనా ఓట్ల బదలాయింపు కీలకం. రెండు పార్టీల్లో ఒకరిపై ఒకరికి వ్యతిరేక త పెంచడం ద్వారా.. ఓట్లు బదిలీ జరగకుండా చూడాలని అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటే.. ముందగా వైసీపీకే ఎక్కువ లాభమన్న అంచనాలు ఉన్నాయి. పెద్దగా బలం లేని చోట కూడా పోటీపడి సీటును తీసుకోవడం వల్ల ఆ అభ్యర్థిని సునాయసంగా ఓడించవచ్చని వైసీపీ ప్లాన్ వేసుకుంది.
ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ పేరుతో ఐ ప్యాక్ వందల అకౌంట్లు సృష్టించి పవన్ కు ప్రాణమిస్తాం.. జగన్ కు ఓటు వేస్తామని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు ,
ఇక నీలి, కూలీ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎవరి క్రియేటివిటీ వాళ్లు చూపిస్తున్నారు. పొత్తులలో ఒకరిపై ఒకరికి అపనమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంత్రులు చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజమైన జనసేన ఓటర్లు మాత్రం.. ఈ సారి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ బలమైన పాత్ర పోషిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసైనికులు .. పవన్ కల్యాణ్ నేరుగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ టీడీపీకే మద్దతు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత … ఆ స్థాయిలో ఉంది మరి. !