సీనియర్ ఐపీఎస్ అధికారి, సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ జగన్ కోసం .. వైసీపీ కోసం పని చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎస్ఆర్ ఆంజనేయల్ని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రఘురామరామకృష్ణరాజు చిత్ర హింసల కేసుతో పాటు జత్వానీ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. హీరోయిన్ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసేందుకు ఆయనే కీలకంగా వ్యవహరించారు. ప్లాన్ రూపొందించారని పోలీసులు ఇప్పటికే నిర్దారించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదు. కోర్టు కూడా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
సీనియర్ ఐపీఎస్ గా ఉన్న ఆయన వైసీపీ హయాంలో రవాణా శాఖ కార్యదర్శిగా కోడెల శివప్రసాదరావుపై వేధింపులకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆయన సేవల్ని మెచ్చి జగన్ మోహన్ రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన పని .. అసాంఘిక కార్యక్రమాలకు ప్లాన్లు చేయడం అన్నట్లుగా మారిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడులు, టీడీపీ నేతలపై దాడులు మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగాయని చెబుతారు. చివరికి వైసీపీ పెద్దల అక్రమ వ్యవహారాల్లోనూ ఆయనది కీలక పాత్ర.
ఫోన్ ట్యాపింగ్ చేసి.. ప్రతిపక్ష నేతలను వేధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం మారగానే ఆయన చంద్రబాబును కలిసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంకా ఏడాదిన్నర సర్వీసు ఉన్న ఆయన.. వీఆర్ఎస్ తీసుకుంటానని వదిలేయాలని ప్రతిపాదన పెట్టారని చెబుతారు. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. లిక్కర్ స్కాంలో నిందితుల్ని కాపాడటానికి ఆయన ఫుల్ టైం పని చేస్తున్నట్లుగా ఏపీ పోలీసులు గుర్తించారు. మొత్తం పలు కేసుల్లో నిందితునిగా ఉండటంతో అరెస్టు చేశారు.