వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సెషన్ ఎప్పుడు జరిగినా ఓ ప్రశ్న ఖచ్చితంగా వేస్తారు. అదేమిటంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తారా అని. కానీ కేంద్రం మాత్రం నిర్మోహమాటంగా ఇచ్చేది లేదని చెబుతూ ఉటుంది. తాజాగా మరోసారి అదే సమాధానం ఇచ్చింది. కానీ వైసీపీ ఎంపీలు నోరెత్తితే ఒట్టు. ప్రతీ సారి అంతే. అటు ఎంపీలు నోరెత్తలు. ఇటు ప్రభుత్వం … మెడలు వంచుతానన్న ప్రభుత్వ పెద్ద కూడా సైలెంట్‌గా ఉంటారు. ప్రతీ సారి ఇదే తంతు. ఎందుకు అంటే ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడానికి.,
గత ఎన్నికలకు ముందు ఆడిన హోదా డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. పెయిడ్ ఆర్టిస్టులతో ఇష్టారితీన మాట్లాడించి… ప్రత్యేకహోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని… ప్రకటించారు. ఇన్ కం ట్యాక్స్ ఉండదనికూడా చెప్పుకొచ్చారు. పాతిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఏ ఎల్లయ్య.. పుల్లయ్య ఉన్నా మెడలు వంచి తెస్తామని జగన్ పెద్ద పెద్దడైలాగులు కొట్టారు. నాలుగేళ్లయినా కనీసం నోరెత్తే సాహసం చేయకపోగా… ప్రత్యేకహోదా రాదని పదే పదే చెప్పిస్తున్నారు.
మాటకంటే ముందే బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని చెబుతూంటారు. కానీ వైసీపీ అవసరం ఎన్నో సార్లు వచ్చింది బీజేపీకి. అలా వచ్చినప్పుడల్లా వ్యక్తిగత అవసరాల కండిషన్లు పెట్టారు కానీ రాష్ట్రం కోసం పెట్టలేదు. ఫలితంగా రాష్ట్రం అన్యాయమైపోయింది. హోదా పోయింది. ఇంకా చెప్పాలంటే.. తము హోదాను లైవ్ లో ఉంచుతున్నామని చెబుతూంటారు. సజీవంగా ఉందంటే అది మా గొప్పే అంటూంటారు. బహుశా… గొడ్డలి వేటు వేయలేదని సంతోషపడండి అని చెప్పడమే ఉద్దేశమేమో. కారణం ఏదైనా హోదా విషయంలో ప్రజల్ని అత్యంత దారుణంగా మోసం చేసిన ముద్ర మాత్రం వైసీపీపై పడిపోయింది.