రాజ్యసభలో మిగిలిన వైసీపీ ఎంపీలు.. లోక్సభలో ఉన్న ముగ్గురు ఎంపీలకు ఇక ఒకటే పని. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా గళమెత్తాలని పోలవరం,ప్రత్యేకహోదా అంటూ సాక్షి పత్రికలో లిస్టు రాసినా అసలు వారికి ఇచ్చిన టాస్క్ ఒక్కటేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేమిటంటే బీజేపీని కాకాపట్టడం. రాజ్యసభలో, లోక్ సభలో ఎవరికి మాట్లాడే అవకాశం వచ్చినా ముందుగా మోదీని పొగడ్తలతో ముంచెత్తాలని ఆ తర్వాత సబ్జెక్ట్ మీదకు వెళ్లారని జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
రెండు రోజుల కిందటి వరకూ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తామని అదనీ.. ఇదనీ చెప్పేవారు. ఇక ముందు అలాంటి మాటలు మాట్లాడవద్దని స్పష్టమైన సంకేతాలు జగన్ ఇచ్చారని అంటున్నారు. ఇంతకు ముందు వరకూ ఏమో కానీ ఇప్పుడు మాత్రం బీజేపీని కానీ మోదీని కానీ విమర్శిస్తే మొదటికే మోసం వస్తుందని.. భయపడుతున్నారు.
రాజ్యసభకు వైసీపీకి ఇంకా ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారికి ఎప్పుడూ రాష్ట్ర సమస్యలపై మాట్లాడే స్వేచ్చా లేదు. కానీ మీడియా ముందు మాత్రం భారీ ప్రకటనలు చేస్తూంటారు. ఇప్పుడు వారికి బీజేపీని.. మోదీని కాకాపట్టే పని మాత్రం అదనంగాకలగనుంది.