ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే సిల్లీ అయిపోయాయి. పోటీలో ఉన్న కూటమి అభ్యర్థుల పేర్లతో పోలిన వారిని ఎక్కడున్న వెదికి పట్టుకుని డబ్బులిచ్చి ఇండిపెండెంట్ గా నామినేషన్లు దాఖలు చేయించారు. జనసేన పార్టీని పోలిఉండేలా జాతీయజనసేన అనే పార్టీని పట్టుకొచ్చారు. గ్లాస్ గుర్తను పోలి ఉండేగుర్తులతో అభ్యర్థులను పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు చూసి.. దింపుడు కళ్లెం ప్రయత్నాలు చేస్తోందన్న సెటైర్లు వస్తున్నాయి.
ప్రజలు అంత అమాయకంగా ఓట్లు వేయరు. వారు ఎవరికి ఓటు వేయాలో ముందే డిసైడ్ చేసుకుని పోలింగ్ బూత్ కు వస్తారు. పేర్లు సిమిలర్ గా ఉన్నంత మాత్రాన.. ఒకరికి బదులు మరొకిరిక పడే అవకాశం లేదు. ఎందుకంటే గుర్తుల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. గుర్తలను బట్టే ఓట్లు వేస్తారు. వ ప్రత్యర్థి పార్టీ గుర్తు విషయంలో ఓటర్లు సందేహ పడితే.. తమ పార్టీ గుర్తు విషయంలోనూ ఓటర్లు సందేహపడతారనే సంగతిని .. కన్వీనియంట్ గా వైసీపీ నేతలు మర్చిపోతున్నారు. అక్కడ ఎంత నష్టం చేయాలని ప్రయత్నిస్తే ఇక్కడ అంత నష్టం జరుగుతుంది.
వైసీపీ అభ్యర్థుల ను పోలి ఉండేలా పేర్లతో ఉన్న ఇతరులు ఎవరైనా నామినేషన్లు వేయడానికి వస్తే పోలీసులతో ఆపేయించారు. వారిని కట్టడి చేశారు. ఇలాంటి ప్రయత్నాలు పంచాయతీ ఎన్నికల్లో చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ చేశారు. ఇలా చేయడం ఘోరమైన నేరం. ఈసీ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఎం చేస్తుందో చూడాల్సి ఉంది. నామినేషన్లు వేయనివ్వకపోతే ఇక ఎన్నికలు పెట్టడం ఎందుకు ?. టీడీపీ, వైసీపీ వారికి ఎంత హక్కు ఉందో.. సామాన్యులకూ నామినేషన్లు వేయడానికి అంతే హక్కు ఉంది. దాన్ని నిరాకరిస్తే ఇక ఎన్నికల ప్రక్రియకు అర్థం ఏముంటుంది ?