వైసీపీ నేతలకు ఏదైనా పెద్ద సమస్యలాగే కనిపిస్తోంది. చివరికి వైసీపీ లింగాల మండల అధ్యక్షుడు, వైసీపీ వైద్యుల విభాగ కార్యదర్శి అయిన వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. ఆయన చనిపోయారు అనగానే వైసీపీ నేతలు ఏదో ఊహించుకుని టీడీపీపై .. చావుతో రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి ప్రారంభించారు. అసలు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోవడంపై టీడీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. కేవలం ఆయన చనిపోయారని వచ్చారని సమాచారం పైనే ఉలిక్కి పడుతున్నారు
వైఎస్ అనే ఇంటి పేరుతోనే ఆయన జగన్ కుటుంబంలోని వ్యక్తి అని అర్థమైపోతుంది. ఎవరో అన్నట్లుగా ఆ ఇంటి పేరు ప్రపంచంలో ఆ కుటుంబానికి తప్ప ఇంకెవరికీ ఉండదు. ఇంకా నలభై కూడా రాని ఆ కుర్ర డాక్టర్.. లింగాల మండలంలో జగన్ కోసం పని చేసి మెజార్టీ తీసుకు వచ్చిన ఆ డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆయన చాలా కాలం జగన్ కోడికత్తి చికిత్స తీసుకున్న ఆస్పత్రి అయిన సిటీ న్యూరో ఆస్పత్రిలో ఉన్నారు. పరిస్థితి విషమించిన తర్వాత ఏఐజీకి తరలించారు. అక్కడ చనిపోయారు. అయితే జగన్ ఆయన ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్నా ఒక్క సారి కూడా పరామర్శించలేదన్నది నిజం.
జగన్ దంపతులు తమ సొంత బంధువును పరామర్శించడానికి కూడా హైదరాబాద్ వెళ్లలేదు. ఓడిపోయిన తర్వాత అసలు హైదరాబాదే వెళ్లలేదు. అది వేరే విషయం. అంతా బెంగళూరు వైపే వెళ్తున్నారు. కానీ తమ కోసం పని చేసిన అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదన్నది చాలా మందికి ఉన్న డౌట్. ఇదే డౌట్ వ్యక్తం చేస్తే..వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. చావును రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ వాళ్లే ఈ చావుపై అతిగా స్పందించి రాజకీయం చేస్తున్నారు. ఇందులో ఏదో ఉందన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. వైసీపీ క్యాడర్ కు.. సోషల్ మీడియా కార్యకర్తలకు దేనిపై ఎలా స్పందించాలో కూడా స్పష్టత ఉండటం లేదన్న నిట్టూర్పు ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.