దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే .. సేమ్ లాంగ్వేజ్ రిపీట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు పెట్టాలాన్న ఉద్దేశంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఇరవై ఎనిమిదో తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి వైసీపీ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ హాజరవడం కష్టమే. కానీ అధికార పార్టీగా ముందుగానే తమ వైఖరి తెలియచేస్తున్నారు. అదేమిటంటే ఎన్నికలు జరపబోమని. ఎన్నికలు పెడతామంటున్న నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అన్ని విషయాల్లోనూ కరోనా భయమే వద్దంటున్న ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఇతర చోట్ల ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. కరోనానే కారణంగా చూపి ఎన్నికలు వద్దంటోంది. మార్చిలో ఎన్నికలను వాయిదా వేశారని నిమ్మగడ్డను కులం పేరుతో దూషించిన కొడాలి నాని.. ఇప్పుడు ఎస్ఈసీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదని తేల్చి చెబుతున్నారు. నిమ్మగడ్డ పదవిలో ఉండేది కొన్ని నెలలు మాత్రమేనని ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరని హెచ్చరిస్తున్నారు. మరో మంత్రి పేర్ని నాని.. కోవిడ్ కారణంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని కోర్టుకు తెలిపామని.. చంద్రబాబు, అచ్చెన్నాయుడికి భయపడి ఎన్నికలు పెట్టడంలేదనుకోవద్దుని చెబుతున్నారు.
అభిప్రాయాలు మార్చుకోకపోతే రాజకీయ నేతలు ఎలా అవుతారన్నట్లుగా… వెంట వెంటనే ఓపీనియన్స్ చేంజ్ చేసుకుని పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించడం.. మంత్రులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అయితే వారికి అది అలవాటయిపోయింది కాబట్టి. … గడుసుగానే తమ మాటల్ని మార్చేస్తున్నారు.