పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకునేవాడు అసలైన నాయకుడు. కానీ వారిని పావులుగా వాడుకుని రాజకీయం చేసి తాను మాత్రమే బాగుండాలని అనుకునేవాడు నాయకుడు కాదు. అలాంటి వారికి ఏదైనా పేరు పెట్టలాంటే దానికి జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన పార్టీ నేతల్ని, క్యాడర్ ను బలిపశువుల్ని చేసి..పావులుగా వాడుకుని రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా అదే వ్యూహం. బలయ్యేవారు బలవుతున్నారు కానీ.. మిగిలిన వాళ్లు ఈ నిజాన్ని గుర్తించలేకపోతున్నారు.
రాప్తాడు ఘటనల్లో బలి చేసేది వైసీపీ నేతల్ని, లీడర్లనే !
రాప్తాడులో బలప్రదర్శన చేయడానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు డబ్బులు ఇచ్చి మరీ జనాలను తరలించారు. హెలిప్యాడ్ దగ్గరకు కార్యకర్తల్ని పంపాల్సిన అవసరం వారికి ఏమి వచ్చింది..? ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి కొన్ని వందల సార్లు హెలికాఫ్టర్ లో పర్యటనలకు వెళ్లారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే హెలికాఫ్టర్ దగ్గరకు ఎందుకు వెళ్లారు.? ఎందుకు రచ్చ చేశారు?. ఇప్పుడు ఆ వ్యవహారంలో కేసులకు బలయ్యేది వైసీపీ కార్యకర్తలే. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?. జగన్ రాప్తాడుకు వచ్చి రెచ్చగొట్టిపోయారు. రేపు జరిగే పరిణామాలకు ఆయన మరింత రాజకీయం చేసుకుంటారు. ఆస్తులు, ప్రాణాలు కోల్పోయేది కార్యకర్తలే.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ పై దాడులు జరిగేలా ప్లాన్
అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల కారణంగా ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు బయటకు రాలేకపోతున్నారు. బయటకు వస్తున్న కొంత మందిని బలి చేసేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు అనే నోటి దూల నేతను రంగంలోకి దింపారు. ఇళ్లలోకి లాగి కొడతాం.. నరుకుతాం అని చెప్పించారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం.. మేం చేయలేమా అని టీడీపీ నేతలు రెచ్చిపోతే ఎవరు నష్టపోతారు.?. వాస్తవంగా జగన్ రెడ్డికి కావాల్సింది ఇదే. తమ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి.. ఎంత నష్టం చేస్తే.. తాను అంత రాజకీయం చేయవచ్చని అనుకుంటున్నారు. అందుకే దాడులు జరిగేలా ప్లాన్లు చేస్తున్నారు. దీన్ని వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారో లేదో కానీ అంతిమంగా బలి పశువులు అయ్యేది మాత్రం వారే.
క్షుద్ర రాజకీయాలు ప్రతీ సారి వర్కవుట్ అవుతాయా ?
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడమే లక్ష్యంగా జగన్ రాజకీయాలు ఉంటాయి. ప్రభుత్వం ఏ పనీ చేయకుండా అడ్డం పడటంతో.. అన్నీ అడ్డంకులు ఎదుర్కొని పనులు చేస్తే శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం జగన్ నైజం. మొదటి నుంచి ఇదే రాజకీయం. ఆయనను తేలికగా తీసుకుంటే.. ఏం జరుగుతుందో వివేకా హత్యలాంటి ఘటనలు నిరూపించాయి. అందుకే ప్రభుత్వం కూడా జగన్ రాజకీయాల నీడ ఆంధ్రాపై పడకుండా… కఠిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంది.