విశాఖలో వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అధికారం ఉందిగా అని… విశాఖ భూములే కాదు, ప్రకృతి సంపదను ధ్వంసం చేసి, దోచేశారు. వైజాగ్ ను రాజధాని చేస్తాం అని వైసీపీ ఎంత మొత్తుకున్నా జనం నమ్మలేదు.
అధికారం పోయిన తర్వాత వైసీపీ పూర్తిగా సైలెంట్ కాగా… విజయసాయి రెడ్డి-శాంతి ఎపిసోడ్ తో ఇంకా డిఫెన్స్ లో పడిపోయింది. ఒకప్పుడు నెం.2గా పార్టీని శాసించిన సాయిరెడ్డికి కనీసం ఒక్కరంటే ఒక్క పెద్ద లీడర్ సపోర్ట్ చేయలేదు. పైపెచ్చు మా పార్టీ లీడర్లు కూడా నాపై కుట్ర చేశారంటూ అంతర్గత గొడవలను ఆయనే బయటపెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ లో భూముల కబ్జా మరోసారి తెరపైకి రావటంతో సాయిరెడ్డి కూడా కాస్త సైలెంట్ అయ్యారు.
కానీ, హఠాత్తుగా ఎర్రమట్టి దిబ్బలను తోడేస్తున్న అంశాన్ని అధికార కూటమే బయటపెట్టింది. అధికారం పోయిన వైసీపీ నేతల ఆగడాలు ఆగలేదని పర్యావరణ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కు సోషల్ మీడియాలో ఫిర్యాదులు అందాయి. దీంతో… ప్రభుత్వం విచారణకు ఆదేశించటం, ఎర్రమట్టి దిబ్బలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి విచారణను మొదలుపెట్టారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్… అధికార పార్టీని ఇరికించాలనుకున్నారు. నెల రోజులైంది పార్టీ అధికారంలోకి వచ్చి… అప్పుడే ఇలా అంటూ వీడియోలు పెట్టారు. దీంతో కూటమి పార్టీలు ఎదురుదాడి ప్రారంభించాయి. దోచించే మీరు… దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉందంటూ ఫైర్ అవుతున్నాయి. ఆక్రమణలతో వైజాగ్ ను చిగురుటాకుల వణికించారు అని ఆక్రమణల ప్లేసును విజిట్ చేస్తుండటంతో వైసీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. మాజీ మంత్రి చేసిన పనికి కూటమి నేతలను అలర్ట్ చేసి మరీ తిట్టించుకున్నట్లు అయ్యిందని, ఇప్పుడు విచారణ చేస్తే బయట పడేది కూడా వైసీపీయేనని… అన్నీ తెలిసి ఎందుకిలా చేస్తున్నారు అంటూ సొంత పార్టీ నేతలే ఫైరవుతున్నారు.
మాజీమంత్రి యాక్షన్ ప్లస్ అవుతుందనుకుంటే సెల్ఫ్ గోల్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.