జగన్ రెడ్డి మనస్థత్వం తెలుసుకున్న వారికి మాత్రమే వైసీపీలో చోటు ఉంటుంది.లేకపోతే చాన్సులు రావు.చాలా సందర్భాల్లో ఆయన కోసం అందరితో శత్రుత్వం పెంచుకున్నా..పట్టించుకోరు అది వేరే విషయం. ఇప్పుడు వైసీపీవారి దృష్టిలోమేకపాటి రాజమోహన్ రెడ్డి చేయకూడని తప్పు చేశారు. ఓ వేడుకలో తనకు నమస్కరించిన నారా లోకేష్ ను ఆయన లేచి నిలబడి శభాష్ లోకేష్ అని అభినందించారు.ఇదంతా మీడియాలో రికార్డు అయింది. వైరల్ అయింది.
అంతే వైసీపీలో ఇక మేకపాటి ఫ్యామిలీకి భవిష్యత్ లేదని తీర్మానించేసుకున్నరు ఆ పార్టీ నేతలు. పొరపాటున కూడా లోకేష్ ను పొగిడే వారికి జగన్ వద్దకు యాక్సెస్ ఉండదు. ఇక నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా ఉండకపోవచ్చు.నిజానికి వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో మేకపాటి కుటుంబం ఎంతో నష్టపోయింది. మంత్రిగా ఉన్న మేకపాటి కుమారుడు చనిపోయాడు.ఆ తర్వాత ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆయన మరో కుమారుడు సులువుగానే గెలిచాడు. కానీ జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు.
గత ఎన్నికల్లో కుమారుడు,సోదరుడు ఇద్దరూ ఆత్మకూరు, ఉదయగిరి నుంచి ఓడిపోయారు .తర్వాత వారు వారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మేకపాటికి వయసు మీదపడటంతో సైలెంట్ గా ఉంటున్నారు.ఇక రాజకీయాల్లో తన కుటుంబసభ్యులు ఉంటారో లేరో కానీ..ఆయన కుటుంబానికి మాత్రం వైసీపీలో చోటు ఉండదని సెటైర్లు పడుతున్నాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్డ బై చెప్పి టీడీపీకి మద్దతుగా మారారు.