వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీల్లాంటిది కాదు. తమదైన సొంత రాజ్యాంగం అమలు చేసే పార్టీ. ఆ రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే అక్కడ ఉండాలి. లేకపోతే.. ఏం జరుగుతుందో.. సుబ్బారావు గుప్తా ఇన్సిడెంటే తెలియచెబుతుంది. సాధారణంగా అంతర్గత ప్రజాస్వామ్యం అని.. మరొకటని రాజకీయ పార్టీల్లో ప్రచారం ఉంటూ ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం కారణంగా తమ పార్టీ లోపాలను కొంత మంది నేతలు అప్పుడప్పుడూ బయటకు చెబుతూ ఉంటారు. వాటిని చూసి సరిదిద్దుకోవడమో.. లేకపోతే.. సైలెంట్‌గా ఉండటమో చేస్తారు. కానీ సొంత పార్టీ నేతలపై దాడులు చేయడం.. అనే కాన్సెప్ట్ ఉండదు. కానీ వైసీపీలో అలా ఉండదు. ఎవరైనా నోరెత్తితే బాదేయడమే.
వైసీపీలో పదవులు రాక… పార్టీ కోసం కష్టపడిన ఎందరో అసంతృప్తితో ఉన్నారు. వారంతా.. ఒక్కొక్కరుగా గొంతు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. సుబ్బారావు గుప్తా…అంశంలో కొడాలి నాని, అంబటి రాంబాబు వంటి వారు చేసిన వ్యాఖ్యలపైనే ప్రచారం జరిగింది. గుప్తా లేవెత్తిన మరో ప్రధాన అంశం.. కష్టపడి నకార్యకర్తలకు గుర్తింపురాకపోవడం.. పదవులు ఇవ్వకపోవడం. తాను బాలినేనికి ఎన్నో ఎళ్లుగా తెలుసని.. ఆయన కోసం విస్తృతంగా శ్రమించానని.. కానీ తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని.. చిన్న పదవి కూడా ఇవ్వలేదని గుప్తా ఆవేదన చెందారు. తనలాంటి వారు ఎందరో ఉన్నారన్నారు. నిజంగానే.., గుప్తా వీడియో బయటకు వచ్చిన తర్వాత వైసీపీ కోసం పని చేసిన అనేక మంది.. తెరపైకి వచ్చారు. తమ పరిస్థితేమిటి అనడం ప్రారంభించారు. ఆ టైంలోనే వైసీపీ నాయకత్వం చురుగ్గాస్పందించింది. గుప్తాతోనే చెక్ పెట్టాలని నిర్ణయించింది.
గుప్తాను చితక్కొట్టేసి ఇంకెవరైనా పార్టీలో అన్యాయం జరిగిందని.. గుర్తింపు రాలేదని నోరెత్తితే.. అదే ట్రీట్మెంట్ అనే సందేశాన్ని నేరుగా పంపేశారు. ఇక ఎవరూ నోరెత్తే సాహసం చేయరు. ఎందుకంటే.. అక్కడ రాజ్యాంగం వేరు. కొట్టినా.. చంపినా పట్టించుకునేవారు ఉండరు. ఈ సందేశాన్ని అర్థం చేసుకుని వైసీపీ నేతలు నోరు మూసుకునే ఉండాలి. లేకపోతే.. జరిగేది అదే. ఒక్క లీడర్‌ను కొట్టి.. ఇంకెవరూ నోరు తెరవకుండా చేయడంలో వైసీపీ నేతల మాస్టర్ ప్లాన్ సూపర్‌గా వర్కవుట్ అయిందని అనుకోవాలి.