వైసీపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంలో ఇది మరో కోణం. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడగడానికి కూడా వారికి నోరు రావడం లేదు. తెలుగుదేశం హయాంలో నాలుగేళ్ల పాటు పోరాడి రాష్ట్రానికి తీసుకువచ్చిన కేంద్ర ప్రాజెక్టులు, విద్యా సంస్థలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోియనా అడగడం లేదు. ఇక కొత్తగా ఇవ్వాల్సిన వాటి గురించి అసలు ప్రస్తావనే లేదు.దుగరాజు పట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఇవేమీ కుదరదవని చెప్పేసింది. అయినా వైసీపీ నుంచి స్పందన లేదు.
చివరికి తెలంగాణతో ఆస్తుల విభజన విషయంలోనూ మీరే చూసుకోండి.. మీ మధ్య పరిష్కారం కాకపోతే మధ్యవర్తిగా ఉంటామని చెబుతోంది. తొమ్మిదేళ్లుగా పరిష్కారం కావడం లేదని.. కోర్టులకు వెళ్తున్నది ఏపీ ప్రభుత్వమే. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కరెంట్ బిల్లుల బకాయిలు ఇప్పించాలని ఊరూవాడా అడుగుతూంటారు జగన్ రెడ్డి.. కానీ అడగాల్సిన కేసీఆర్ను.. ఇప్పించాల్సిన కేంద్రాన్ని మాత్రం అడగరు. కనీసం లక్షన్నర కోట్ల విలువైన ఉమ్మడి ఆస్తుల్లో వాటా రావాల్సి ఉందని చాలా కాలంగా లెక్కలు ఉన్నాయి. వాటిన్నింటినీ పట్టించుకోవడం లేదు.
కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను తప్పు పట్టడానికి గంటకు పైగా వెచ్చించి మీడియాతో మాట్లాడారు. కానీ ఆయన రాష్ట్రం గురించి ఒక్క ప్రకటన చేయలేదు. ఆయనే కాదు వైసీపీ నేతలెవరూ చేయలేదు. రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు.. తాము ఖూనీలు చేసినా పక్కనోడి మీదకు నెట్టేసి బయటపడిపోవాలన్న తాపత్రయం.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తమ కేసుల నుంచి బయటపడేందుకు మాత్రమే వినియోగించడం మాత్రమే చేస్తున్నారు. దీని వల్ల ఏపీకి.. ప్రజలకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు.
ఇప్పటికే రాష్ట్ర ప్రజల వైపు దేశం మొత్తం విచిత్రంగా చూస్తోంది. సొంత రాష్ట్రాన్ని, బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నా .. ప్రభుత్వం ఇచ్చే రూ. పదివేలు చాలన్నట్లుగా ప్రజలు ఉంటున్న వైనంపై ఆశ్చర్యకరంగా చూస్తున్నారు.