తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.. ఆ రాష్ట్ర అంతర్గత వ్యవహారం.. మాకేమిటి సంబంధం..?. ఇదీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి స్పందన. ఇంటర్ పరీక్షల వ్యవహారాలన్ని అక్కడి ప్రభుత్వం ఆ విషయం చూసుకుంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంటర్ బోర్డు, పరీక్షలు, ఆత్మహత్యలు.. అన్నీ తెలంగాణవే.. అయితే.. ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతగా.. అన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆయన ఎందుకు అంత సందేహిస్తున్నారన్నదే కీలకం. విజయసాయిరెడ్డి స్పందన.. రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం కలగిస్తోంది.
మాట కంటే ముందు.. తెలంగాణ ప్రభుత్వానికి… సూపర్ అంటూ సర్టిఫికెట్ ఇవ్వడానికి … ఏ మాత్రం వెనుకాడని విజయసాయిరెడ్డి.. ఇంటర్ ఫెయిల్యూర్ విషయంలో మాత్రం తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించి.. తప్పించుకోవావాలనుకున్నారు. ఇప్పటికే.. అన్ని రాజకీయ పార్టీలు.. ఇంటర్ బోర్డు వ్యవహారం, పిల్లల ఆత్మహత్యలపై.. స్పందించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ నేతలు మాత్రం.. అచ్చం టీఆర్ఎస్ నేతల్లాగే మౌనం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనను ప్రతీ రోజూ విమర్శిస్తూ.. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాలన సాగుతోందని… నమ్మే ముఖ్యనేతల్లో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు. అందుకే.. వారు ఏపీలోని ఏ వ్యవస్థను నమ్మరు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. కాబట్టి.. అక్కడ పోలీసు వ్యవస్థ దగ్గర్నుంచి ప్రజల వరకూ అందరూ.. టీడీపీ సానుభూతిపరులేనని అనుకుంటూ ఉంటారు. అందుకే ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. నేరుగా.. తెలంగాణ పోలీసులకే చేసుకుంటారు తప్పా.. ఏపీ వరకూ రారు. అంతగా… తెలంగాణతో మమేకమైపోయిన… విజయసాయిరెడ్డికి.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం… పట్టరానివిగా మారాయి. కనీసం…. ఇంటర్ విద్యార్థులకు సంఘిభావం తెలియజేయడానికి కూడా ఆయన సిద్ధపడలేదు. ఓ రాజకీయ పార్టీగా అయినా స్పందించలేని పరిస్థితుల్లో వైసీపీ ఉండిపోయింది.