విజయసాయిరెడ్డి వైసీపీ క్యాంపులో ఓ పెద్ద బాంబే వేశారు. ఆయన చేసిన ఆరోపణలు చిన్నవి కాదు. లిక్కర్ స్కామే జరగలేదని అంతా పారదర్శకంగా ఉందని వైసీపీ నేతలు వాదిస్తూ వస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి మొత్తం స్కాంకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినే కీలకం అని బయట పెట్టేశారు. అంతేనా పోర్టు వ్యవహారంలో అంతా విక్రాంత్ రెడ్డే చేశాడని బయట పెట్టారు. అంటే ఈ వ్యవవహారాల్లో ఆయన వైసీపీని నిలబెట్టి నిప్పు అంటించేశారని అనుకోవాలి.
మద్యం స్కాం చిన్నది కాదు. ప్రజల రక్త మాంసాలను పీల్చిన స్కాం. ఇప్పటి వరకూ అరెస్టులు చేయలేదు కానీ.. మొత్తం దందాను వెలికి తీయడంలో సీఐడీ చాలా చురుగ్గా ఉంది. అన్ని వివరాలు బయట పెట్టింది. అసలు డబ్బులు ఎలా తరలిపోయాయో కూడా పక్కా ఆధారాలతో రెడీ చేయించారు. ఇక పోర్టు వ్యవహారంలో కూడా అంతే. విజయసాయిరెడ్డి తన మీదకు రాకుండా అందర్నీ ఇరికించడానికి సిద్ధమేనని తన మాటల ద్వారా సంకేతాలు పంపారు.
ఈ విషయంపై వైసీపీ నేతలెవరూ స్పందించడం లేదు. విజయసాయిరెడ్డిపై ఎవరు ఎలా స్పందిస్తారో స్పష్టత లేదు. మామూలుగా వైసీపీలో ఎవరు మాట్లాడినా వ్యక్తిగత అభిప్రాయాలే. అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్చ చాలా మందికి లేదు. సజ్జల ఆఫీసు నుంచి స్క్రిప్ట్ వస్తే తప్ప మాట్లాడలేరు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని రెచ్చగొడితే మరింతగా నష్టం జరుగుతుందని అందరి బండారం బయటపెడితే మొదటికే మోసం వస్తుందని సైలెంటుగా గా ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.