రాజకీయ బానిసత్వం అనే పదానికి సరైన నిర్వచనంలా వైసీపీ కనిపిస్తోంది. బీజేపీ కాళ్లు పట్టుకుని వదిలేది లేదంటోంది. బీజేపీకి మద్దతుగా ఉండటం వరకూ అయితే సరే వాళ్ల కేసుల బాధలు వాళ్లవి.. ప్రజలు ఇచ్చిన బలంతో ఆ కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు..కానీ వారు ఇతర పార్టీలను విమర్శిస్తున్నారు. మోదీని తమలా పొగడకుండా ఇతర పార్టీలు తప్పు చేస్తున్నాయని నిస్సిగ్గుగా మీడియాకు చెబుతున్నారు. బీజేపీ పెద్దల చల్లని చూపుల కోసం దిగజారిపోతున్నారు.
రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీ వైసీపీ
ప్రజలు నేరుగా ఓట్లు వేసిన ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోయినా గతంలో వచ్చిన బలం వల్ల ప్రస్తుతం రాజ్యసభ లో వైసీపీ చాలా బలంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ తర్వాత ఎక్కువ మంది సభ్యులు ఉన్నది వైసీపీకే. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితుల్లో ఉన్న వైసీపీ మోదీని పొగిడి… తమ కేసుల జోలికి రాకుండా చేసుకునేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమవుతోంది.
రాజ్యసభలో హోదా కోసం డిమాండ్ చేయవచ్చుగా ?
బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేదు. ఇటీవలి కాలం వరకూ వైసీపీ, బీజేడీ బీజేపీకీ మద్దతుగా ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేడీ కూడా రాజ్యసభలో మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించింది. మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసింది. కీలక అంశాలపై మోదీ మాట్లాడలేదని వాకౌట్ చేసింది. కానీ వైసీపీ మాత్రం తమ సమస్యలకు తమకు ఉన్నాయని బీజేపీ కోసం బ్యాటింగ్ చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క మాట మాట్లాడలేదు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని బీజేపీని విజయసాయి అడగకలేదు.
తోటి పార్టీలపై విమర్శలు
వైసీపీ భావదారిద్ర్యం ఎలా ఉందంటే… ఇతర పార్టీలు మోదీపై పోరాడుతుంటూ.. వారిపై నిందలు వేస్తున్నారు. మోదీ మాట్లాడుతూంటే ఇతర పార్టీలు ఆందోళన చేయడం… బహిష్కరించడం ఏమిటని విజయసాయిరెడ్డి బాధపడిపోయారు. అలా చేయడం తప్పన్నారు. బీజేపీ నేతలు కూడా ఇలా మాట్లాడలేదు. టీడీపీతో జత కలిసి వైసీపీ ఘోర పరాజయానికి బీజేపీ కారణమైనా సిగ్గులేకుండా ఆ పార్టీకి మద్దతిస్తున్నారంటే.. ఇంత కంటే వెన్నుముక లేని రాజకీయం ఎవరు చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.