చంద్రబాబు మేనిఫెస్టోను కనిపించకుండా చేశారని వైసీపీ నేతలంటారు..అయితే వైసీపీ మరింత వినూత్నంగా మేనిఫెస్టోను మార్చేసి కొత్త ఒరవడి సృష్టిస్తోంది. తాము హామీలు అమలు చేశామని చెప్పుకోవడానికి కొత్త మెనిఫెస్టో రెడీ చేస్తోంది. మెల్లగా ఒక్కొక్కటి మార్పు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతోంది. హామీలు అమలు చేశామని చెప్పడానికి.. మేనిఫెస్టోను ఇప్పుడు మార్చేస్తున్నారు.
మాకు మేనిఫెస్టోనే బైబిల్ అని.. మరొకటని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసుకునే వైసీపీ నేతలు.. ఆ మేనిఫెస్టోలో చెప్పినవేవీ అమలు చేయలేకపోయారు. మద్య నిషేధం దగ్గర్నుంచి సీపీఎస్ రద్దు వరకూ ఏ హామీ చూసినా అమలు చేయనట్లే కనిపిస్తోంది. దీంతో మేనిఫెస్టోను మెల్లగా మార్చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త మేనిఫెస్టో పోస్టర్లు అంటిస్తున్నారు.ఈ మేనిఫెస్టోలో మద్యనిషేధానికి బదులు మద్య నియంత్రణ అనే పదం పెట్టారు.
ఇప్పటికే ఒకరిద్దరు వైసీపీ నేతలు తాము మద్య నిషేధం హామీ ఇవ్వలేదన్న ప్రచారం చేస్తున్నారు. రేపో మాపో.. వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే ప్రకటించే చాన్స్ ఉంది. అందులో వ్యూహాత్మకంగా మేనిఫెస్టోను మార్చేస్తున్నారు. తాము 99 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకునే వైసీపీ నేతలు.. మేనిఫెస్టో ముందు.. పెట్టి ఫలానాది అమలు చేశామని చెబితే బాగానే ఉంటుంది. కానీ పరిమితంగా కొంత మందికి ఇస్తున్న పథకాలను మాత్రేమ చూపించి ఇతర హామీలన్నింటినీ మేనిఫెస్టో నుంచి తొలగించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు.