తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు లోకేష్‌తో సమావేశం అయ్యారు. వెంటనే సోషల్ మీడియా ఇంచార్జ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆ ఫోటోపెట్టి మహిళలకు టీడీపీలో లైంగిక వేధింపులు అని అసభ్యకరభాషలో పోస్ట్ చేశారు. అది జాతీయ స్తాయిలో మహిళా కమిషన్ వద్దకు ఫిర్యాదుగా వెళ్లింది. తమిళనాడులో ఎవరో బీజేపీ మహిళా నేతతో ఆ పార్టీ నేత చేస్తున్న వెకిలి చేష్టల వీడియో దొరికింది. కోతికి కొప్పరి చిప్ప దొరికినట్లు గుర్రంపాటి ఆ వీడియో ను.. తనతో పాటు సోషల్ మీడియా టీంతో ప్రచారం చేయించారు. చివరికి ఆ విషయంలోనూ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ కేసుల సంగతి పక్కన పెడితే.. అసలు ప్రజలు కూడా ఛీత్కరించుకునేలా ఈ వ్యవహారం ఉంది.
వైసీపీ అంటేనే ఫేక్ అనే ఓ నమ్మకాన్ని నిలబెట్టేలా వీరి తీరు ఉంది. అబద్దం చెబితే గోడ కట్టినట్లుగా ఉండాలంటారు .. సోషల్ మీడియాలో అయితే నమ్మేలా చెప్పాలి… కానీ అబద్దాలే పెట్టుబడిగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఆ స్కిల్ పూర్తిగా కోల్పోయింది. ఎప్పటికప్పుడు తప్పుడు పనులు చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోతోంది. ఆ పార్టీ పరువు తీస్తోంది. వీరి తీరుతో సోషల్ మీడియాలో ఉండే కొంత మంది సంప్రదాయవాదులు.. పార్టీ సానుభూతిపరులు కూడా ఇదే పద్దతని అనుకోవడం ప్రారంభించారు. ఇక సామాన్యులు ఎలా ప్రోత్సహిస్తారు ?. ఈ విషయం జగన్ గుర్తించారేమో కానీ విజయసాయిరెడ్డిని పక్కనపెట్టి.. సజ్జల కొడుక్కి చాన్సిచ్చారు.
కానీ గుర్రంపాటి లాంటి బూతులే సోషల్ మీడియా బలం అనుకునేవాళ్లతో ఎంతో కాలం బండి లాగించలేరు. గత ఎన్నికల్లో ప్రభుత్వంపై ఫేక్ ప్రచారాలను బలంగా తీసుకెళ్లగలిగారు.. అప్పట్లో బూతులు లేవు. ఇప్పుడు ఫేక్ ప్రచారాలని అందరికీ తెలిసేలా బూతులతో విరుచుకుపడుతున్నారు. అందుకే మొదటికే మోసం వస్తోంది. ఈ ఉపద్రవాన్ని గుర్తించి కూడా గుర్తించనట్లుగాఉంటే…అధికారం పోయిన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.