వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందో వారికే అర్థమవుతుందో లేదో మరి. రాత్రి ఏడుగంటలకు వంశీ అరెస్టు గురించి సంచలన విషయాలు బయట పెడతామని ప్రకటించింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలంతా టీజర్లు వేశారు. ట్రైలర్లు కూడా వేశారు. సాయంత్రం ఏడు కాగానే వారి ట్విట్టర్ హ్యాండిల్ చూసుకుని ముక్కు మీద వేలేసుకున్నారు. అదేమిటంటే.. కోర్టులో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్ మెంట్. అసలు అది ఇచ్చాడనే కదా ఇప్పుడు ఎపిసోడ్ అంతా జరుగుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటి?
సత్యవర్ధన్ ఓ సాయంత్రం హఠాత్తుగా కోర్టులో ప్రత్యక్షమై తాను ఫిర్యాదు ఇవ్వలేదని..పోలీసులే రాసుకున్నారని.. తన వల్ల కాదని.. కేసు ఉపసంహరించుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చారు. అక్కడ్నుంటే కథ ప్రారంభమయింది. వంశీ బెదిరించి మరీ ఈ స్టేట్ మెంట్ ఇప్పించారని పోలీసులు గుర్తించి కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇప్పుడు కొత్తగా సత్యవర్ధన్ ఆ స్టేట్ మెంట్ ఇచ్చాడని బ్లాస్టింగ్ అని బయట పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో.. వైసీపీ సోషల్ మీడియా పెద్దలకే తెలియాలి. ఐ ప్యాక్ వ్యూహకర్తలు లేకపోయే సరికి వారికి మైండ్ బ్లాంక్ అయిందా లేకపోతే.. అందరికీ తెలిసిన విషాయన్ని బ్లాస్టింగ్ అని ప్రకటిస్తే సంచలనం అయిపోతుందని అనుకున్నారా అన్నది వైసీపీ క్యాడర్ కే అర్థం కావడం లేదు.
ఇలాంటి సోషల్ మీడియాను పెట్టుకుని పార్టీని నడపడం అంటే చిన్న విషయం కాదన్న సెటైర్లు ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు వేస్తున్నారు. బ్లాస్టింగ్ అంటే ఏదైనా కొత్త విషయాన్ని చెబుతారు కానీ..అసలు వివాదం ప్రారంభమైన దాన్ని ఎవరికీ తెలియనట్లుగా..అదేదో కొత్త పాయింట్ అన్నట్లుగా చెప్పడం మాత్రం ఎవర్ గ్రీన్. ట్రోల్ కావడానికి వైసీపీ సోషల్ మీడియాకు ప్రత్యేకంగా కారణాలు అక్కర్లేదేమో?