పోలింగ్ సరళితోనే వైసీపీ దుకాణ్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రిషిరాజ్ సింగ్ నేతృతవంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక చాలని చెప్పేశారు. ఐ ప్యాక్ ద్వారా విచ్చలవిడిగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ ను కొనుగోలు చేశారు. దీనికి రూ. యాభై కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఆ మొత్తం ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. తర్వాత భారతి కలుగచేసుకుని సెటిల్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఐ ప్యాక్ టీంలో వందల మంది ఉన్నారు. వారంతా రోడ్డున పడ్డారు. ఇక వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా సాగనంపడం ఇక్కడ అసలు విశేషం. వైసీపీ సోషల్ మీడియాలో నూట యాభై మంది వరకూ పని చేస్తున్నారు. వీరంతా సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో పని చేస్తూ వచ్చారు. వారందర్నీ కూడా తీసేశారు. అయితే నేరుగా తీసేసినట్లుగా చెప్పకుండా ఎన్నికల ఫ లితాల వరకూ సెలవులు ఇస్తున్నామని చెప్పి పంపేశారు. దీంతో అసలు జీతాలు ఇస్తారా లేదా అన్న టెన్షన్ వారిలో ప్రారంభమయింది. గత ఆరు నెలలుగా సోషల్ మీడియా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు.
వైసీపీ సోషల్ మీడియా, ఐ ప్యాక్ చేసిన ఫేక్లకు ప్రభుత్వం మారితే ఎవరెవరిపై కేసులు పడతాయో అంచనా వేయడం కష్టం. స్వయంగా సజ్జల భార్గవరెడ్డిపైనే కేసు నమోదయింది కూడా. పోలింగ్ సరళి ఏ మాత్రం ఉత్సాహంగా లేకపోవడంతోనే వైసీపీ ఇలా డీలా పడిపోతుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.