వైసీపీలో వర్రా నుంచి ఇంటూరి వరకూ అనేక మంది సోషల్ సైకోలు ఉన్నారు. ఊరూ పేరూ లేకుండా అడ్డగోలు అకౌంట్లతో వచ్చి అమ్మ నా బూతులు తిట్టే సైకోలు ఉన్నారు. వారంతా ఎక్కడి నుంచి వచ్చారు ..ఎవరు వారు అన్నది ఇప్పుడిప్పుడే పోలీసులు బయటకు తెస్తున్నారు. అలాంటి వారిని చూసి సోషల్ మీడియాలో ఉన్న వారు కూడా ఆశ్చర్యరపోతున్నారు. వైసీపీ సోషల్ మీడియాకు అతి పెద్ద నెట్ వర్క్ ఉందని.. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతూ ఉంటాయని కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
పోలీసులకు పట్టుబడుతున్న సోషల్ సైకోల్లో అత్యధిక మంది గత ప్రభుత్వంలో జీతాలు పొందారు. ఏ పని చేయకపోయినా సోషల్ మీడియాలో ఇతర పార్టీల నేతలు, వారి కుటుంబాలపై బూతు పోస్టులు పెట్టడం, వీడియోలు చేయడం వంటివి చేసిన వారికి రెగ్యులర్గా పేమెంట్లు అందాయని గుర్తించారు. గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ సహా పలు కార్పొరేషన్ల కింద వీరిని కాంట్రాక్ట్ పద్దతిలో హైర్ చేసుకున్నట్లుగా చూపించి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించారు. చివరికి ఇలాంటూరి రవికిరణ్ అనే వాడికి ఏకంగారూ. 70వేల జీతం ఇచ్చినట్లుగా ఆధారాలు లభించాయి.
ప్రజాధనాన్ని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా ఇవ్వడం పెద్ద నేరం. అంతకు మించి జీతాలు ఇచ్చి మరీ వారితో నేరాలు చేయించారు. మొత్తం సోషల్ మీడియా నెట్ వర్క్ పై దృష్టి పెట్టిన పోలీసులు.. కింద నుంచి పై వరకూ అందరి గుట్టూ బయటకు లాగుతున్నాయి. డబ్బులు ఇచ్చి ఇలా బూతులు తిట్టించడం ఖచ్చితంగా నేరమే అవుతుంది. ఇప్పటికే దాదాపుగా వైసీపీ నెట్ వర్క్ ను చేధించిన పోలీసులు అసలు సూత్రధారుల వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరింత సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి.