టీడీపీ నేతలు నిజాలు సోషల్ మీడియా లో పెట్టిన గతంలో ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు కదా మాకేంటి భయం అని కొంత మంది వైసీపీ కార్యకర్తలు గీత దాటిపోతున్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా జాగ్రత్త పడుతూంటే ఇక్కడ ఉండే పెయిడ్ కార్యకర్తలు మాత్రం రెచ్చిపోయేందుకు వెనుకాడటం లేదు. వీరంతా చిన్న చిన్న కేసుల్లో కాకుండా బయటకు రాకుండా.. బయటకు వచ్చినా జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చే కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
తిరుమల విషయంలో చైతన్యరెడ్డి అనే వ్యక్తి అన్ని హద్దదులు దాటిపోయాడు. చివరికి అది పెద్ద కేసు అయింది. పరారయ్యాడు. కానీ ఎన్నో రోజులు పరారు కాలేడు. ఇలా పది మంది వరకూ పరారీలో ఉన్నారు. కొంత మందికి నోటీసులు ఇచ్చి వదిలేశారు.. కాబట్టి మాకూ అంతే కొంత మంది అనుకోవడంతోనే సమస్య వస్తోంది. కానీ ఒక్క సారిగా పోలీస్ రాడార్ లోకి వెళ్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఇలాంటి యువతను చేరదీసి పోలీసు కేసుల్లో ఇరికించి వారి భవిష్యత్ ను వైసీపీ సోషల్ మీడియా నాశనం చేస్తోంది.
తిట్టడం, ఫేక్ ప్రచారం చేయడం పెద్ద విషయం కాదు. కానీ కేసుల పాలయితే తమ పార్టీ ఒక్క సారి స్టాండింగ్ పోస్టులు పెట్టి తరవాత మర్చిపోతారు. వైసీపీలో ఇది మరీ ఎక్కువ. వైసీపీ కార్యకర్తల కోసం లాయర్లను పెట్టామని చెబుతూంటారు. కానీ మీడియాలో రాకపోతే ఒక్కరంటే ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తరు. ఇలాంటి బాధలు పడే వారికే తెలుసు. అయినా కొంత మందిని రెచ్చగొట్టి తమ పని తాము చేసుకుంటూనే ఉన్నారు వైసీపీ నేతలు.