ఎంతైనా ఫేక్ చేసే ప్రొఫెషనల్స్ ఐ ప్యాక్ కు.. సజ్జల భార్గవ అమాయక తెలివి తేటలకు చేలా తేడా ఉంటుంది. ఎంత తేడా అంటే… మామూలు వ్యక్తులు కూడా పాపం ఇంత అమాయకులేంటి అని ఆశ్చర్యపోయేంతగా. సజ్జల భార్గవ అనంతపురంలో నిరుద్యోగుల భారీ ర్యాలీ అని ఓ వీడియో పెట్టి గొప్ప పని చేశానని అనుకున్నారు. కానీ అది నాలుగు నెలల కిందట వైసీపీ నిర్వాకంపై జరిగిన ర్యాలీ అని నెటిజన్లు ఒక్క నిమిషంలోనే కనిపెట్టి… ఇంత అమాయకులేంట్రా బాబు అని.. జాలిపడ్డారు.
కాసేపటికి.. వైసీపీ సోషల్ మీడియా విశాఖలోని మహాత్మగాంధీ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రభుత్వం అమ్మేసిందని ప్రచారం ప్రారంభించారు. విశాఖలో కింగ్ జార్జ్ ఆస్పత్రి ఉంది.దాన్ని వైసీపీ సర్కార్ తాకట్టు పెట్టిందని అందరికీ తెలుసు. మరి ఈ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎక్కడితో ఎవరికీ అర్థం కాలేదు. కానీ విశాఖ వాళ్లకు తెలుసు. అది ప్రైవేటు ఆస్పత్రి. అసలు ఆ ఆస్పత్రి ప్రభుత్వానికి ఇసుక రేణువంత సంబంధం లేదు. మరి ప్రభుత్వం ఎలా అమ్మేస్తుందో అన్న ఆలోచన చేయలేకపోయారు. అంత తేలివితేటలు ఎవరికీ లేవు.
విశాఖలోని మహాత్మ గాంధీ ఆస్పత్రిని అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన మరో ఆస్పత్రి గ్రూపు టేకోవర్ చేసింది. అది వారి ప్రైవేటు ఆస్తుల వ్యవహారం . కానీ ప్రభుత్వం అమ్మేసిందంటూ ప్రచారం ప్రారంభించేశారు. అదే నిజమైతే.. ఈ లెక్క జగన్ ప్యాలెస్ లన్నింటినీ ప్రభుత్వం అమ్మేయవచ్చని టీడీపీ నేతలు సెటైర్లు ప్రారంభించారు. పండిత పుత్ర పరమశుంఠలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని రకాల కుట్రల నిపుణుడు అయితే.. సజ్జల అంత అమాయకుడు.. ఏం చేసినా ఇట్టే దొరికిపోతాడని తేలిపోతోంది.
ఇలా అయితే వైసీపీ సోషల్ మీడియా రాను రాను లాఫింగ్ స్టాక్ గా మారిపోతుందని ఎవరూ దేకను కూడా దేకరని ఆ పార్టీ క్యాడర్ కూడా నిరాశలో కూరుకుపోతున్నారు.