భారతీయ జనతా పార్టీ ఆలోచనలకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి మద్దతుగా నిలబడింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమవుతున్న జమిలీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఈ విషయంపై అభిప్రాయాలు కోరిన “లా కమిషన్” చైర్మన్ తో …వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. మత పార్టీ అభిప్రాయాలను లేఖ రూపంలో వివరించారు. జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలు వివరించి… ఎదురయ్యే సవాళ్లను కూడా.. లేఖలో తెలిపి.. అంతిమంగా..తమ పార్టీ.. జమిలీ ఎన్నికలకు అనుకూలమని లేఖలో పేరొన్నారు.
దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణ విషయంలో లా కమిషన్ .. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలు.. జమిలీకి మద్దతు ప్రకటించాయి. కానీ మెజార్టీ పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అకాలీదళ్, టీఆర్ఎస్, వైసీపీ జమిలీ ఎన్నికలను గట్టిగా సమర్థిస్తున్నాయి. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ… ఇదో రాజకీయ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే దిశగానే జమిలీ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి.
ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ.. ముందస్తుగా జమిలీ అయితే ఒప్పుకునే ప్రశ్నే స్పష్టం చేసింది. సాధారణంగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసే వస్తున్నాయి. కాబట్టి ఎన్నికలను ఇలా ఎదుర్కొనే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్న టీడీపీ ముందస్తు జమిలీకి మాత్రం నో చెప్పింది. ఇప్పుడు వైసీపీ.. ముందస్తు అయినా.. సమయానికే అయినా జమిలీకి సిద్ధమని లేఖ ఇచ్చింది. అంటే ఏపీలో ఉన్న రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు … జమిలీపై రెండు వేర్వేరు అభిప్రాయాలను లా కమిషన్ కు చెప్పాయి. డిసెంబర్ లో … లోక్ సభతో పాటు పదిహేను రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపి పాక్షిక జమిలీ నిర్వహించాలని.. 2024కి పూర్తి స్థాయి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. దాని కోసం రాజ్యాంగ సవరణ అవసరం. లా కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత… దాని ప్రకారం కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.