ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు వివరిస్తూ పథకాల అమలు గురించి చెప్పారు. కష్టంగా ఉన్నా అమలు చేస్తున్నామని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అప్పులు చేసి అయినా అమలు చేస్తామన్నారు. అయితే వైసీపీ , సాక్షి మీడియా, సోషల్ మీడియా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంటూ ప్రచారం ప్రారంభించారు. దీనిపై టీడీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారు అలా ప్రచారం చేస్తే కాగలకార్యం వైసీపీ నేతలే తీర్చేస్తున్నట్లు వారు రిలీఫ్ ఫీలవుతున్నారు.
తమ నిర్వాకం వల్లే ఏపీ మునిగిందని వైసీపీ పరోక్ష ప్రచారం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అందుకే పథకాలు అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు అన్నట్లుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజల్ని మానసికంగా రెడీ చేస్తున్నట్లుగా అవుతుంది. జగన్ రెడ్డి చేసి పోయిన అప్పులు.. చేసిన విధ్వంసం కారణంగానే చంద్రబాబు పథకాలు ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడేలా వైసీపీ ప్రచారం ఉంటోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అందుకే వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి పెద్దగా అడ్డం రావడం లేదు. ప్రజల్లో పథకాలపై అశలు తగ్గించే పనిని వైసీపీ చేస్తే.. టీడీపీకి అంత కంటే కావాల్సింది ఏముంటుంది ?
కాస్త లేటు అయినా పథకాల అమలు ఖాయం !
పథకాల అమలు కష్టమే కానీ చంద్రబాబు తప్పక అమలు చేయాలి. నా వల్ల కాదు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఇలా ఏ రాజకీయ నాయకుడు చేయడు. కనీసం జగన్ అమలు చేసినట్లుగా అయినా చేస్తారు. అయితే వైసీపీ నేతలు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అందుకే అమలు చేయడం లేదని ప్రచారం చేసేస్తున్నారు. దీంతో పథకాలపై ఇప్పుడిప్పుడే ఆశలు పెట్టుకోకుండా ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అయితే రేపోమాపో రైతుల ఖాతాల్లో.. తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. అప్పుడు అంచనాలకు మించి పథకాలు అమలు చేసినట్లుగా .. సంపద సృష్టించి మరీ చంద్రబాబు పథకాలు అమలు చేస్తున్నారి ప్రజలు అనుకుంటారుత. టీడీపీకి ఇంతకంటే కావాల్సింది ఏముంది ?
వైసీపీకి ఆయాసమే కానీ.. రాజకీయం తెలియడం లేదు !
పథకాలను అమలు చేసి తీరాల్సిందేనని లేకపోతే ఊరుకోమని ప్రకటనలు చేయాలి కానీ.. చంద్రబాబు చేతులెత్తారని ఇక పథకాలు రావని ప్రచారం చేయడం అమాయకత్వం. ఆ విషయం రాజకీయాల్లో కనీస ఆవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. వైసీపీ నేతలకు .. వారి యజమానిలాగే బుర్ర పరిమితంగా ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ తమకు కావాల్సిన విధంగా ట్యూన్ చేసుకుంటోంది.