ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపించకూడదు. అలా చూపించకపోతే సంప్రదాయ వ్యూయర్స్ కూడా పక్క చానళ్లకు వెళ్లిపోతారు. కానీ ఏం చేయలేని పరిస్థితి. వైసీపీ అధికారిక చానల్ సాక్షి సంగతి చెప్పాల్సిన పని లేదు. జగన్నుతప్ప ఎవరినీ చూపించే అలవాటు లేదు. జగన్‌కు వ్యతిరేకం అయితే అసలు చూపించరు. వారికి నో రిగ్రెట్స్ కానీ.. టీవీ9, ఎన్టీవీతో పాటు ప్రో వైసీపీ మీడియాకు మాత్రం చాలా కష్టం వచ్చింది. తెలుగులో రెండు ప్రధాన చానళ్లు అయిన టీవీ9, ఎన్టీవీ ఉద్యోగులు ప్రభంజనంలా వచ్చారని తెలిసినా చూపించడానికి మొహమాట పడ్డారు. బండి సంజయ్ దీక్ష చేస్తే మాట్లాడినంతసేపు లైవ్ ఇవ్వగలిగారు కానీ బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం ఉద్యోగులతో నిండిపోయినా చూపించలేకపోయారు.
టీవీ9 సాయంత్రం వరకూ అదే విధానానికి కట్టుబడింది. ఎన్టీవీ తర్వాత ఫీడ్ బ్యాక్ వచ్చిందో లేకపోతే.. మీడియా అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుందో కానీ మధ్యాహ్నం తర్వాత కాస్త కవరేజీ ఇచ్చింది. ఈ పరిస్థితిని పోటీ చానళ్లు.. వైసీపీకి పక్కా వ్యతిరేకంగా పేరు తెచ్చుకున్న ఏబీఎన్, టీవీ 5 బాగా క్యాష్ చేసుకున్నాయి. ఎంత అంటే.. ఒక్కో చానల్‌కు ఒక్కో సారి ఇరవై వేల మంది వరకూ లైవ్ వ్యూయర్స్ వచ్చారు. ఇది కేవలం ఇతరులు ఇవ్వకపోవడం వచ్చిన వ్యూయర్ షిప్. అందుకే దాన్ని అలా కంటిన్యూ చేశారు.
చివరికి విలువలు.. విశ్వసనీయతను కూడా తాకట్టు పెట్టుకుని ఈ రెండు చానళ్లు పాలక పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రసారం చేయకపోవడం వాటి దుస్థితిని తెలియచేస్తోంది. అయితే ఉద్యోగుల ఉద్యమం చూపించలేదు కానీ.. ఆ ఉద్యమంపై మాట్లాడిన వైసీపీ మంత్రులు.. సజ్జల.. సీఎస్ వంటి వారికి మాత్రం కావాల్సినంత స్పేస్ ఆ చానళ్లలో లబించింది.