ఏపీలో ఒక్కో బాటిల్ పై పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం వ్యాపారులు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టి, నిర్వహణ ఖర్చులు పెట్టుకుని చేస్తున్న వ్యాపారంలో నెష్టం వస్తూండటంతో అదే పనిగా విజ్ఞప్తులు చేసుకోవడంతో వారికి మార్జిన్ పెంచారు. ఆ పెంపును బాటిల్ కు రూ. పది పెంచి కవర్ చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వందలకోట్లు లంచాలు చంద్రబాబుకు వెళ్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. అంత చిన్న మొత్తానికి వందల కోట్లు వస్తే.. రూ. 60 ఉండే క్వార్టర్ బాటిల్ ను రూ. 260కి అమ్మిన వైసీపీ హయంలోఇంకెంంత దోపిడీ జరిగి ఉండాలి ?
జే బ్రాండ్ల నుంచి విముక్తి కలిగిన విషయం గుర్తుకొస్తుంది!
ఏపీలో ఇప్పుడు లిక్కర్ వ్యవహారం అంతా ఓపెన్ గా నడుస్తోంది. పలానా బ్రాండ్ మాత్రమే అమ్ముతామని ఎవరూ చెప్పడం లేదు. అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. తాగేవాళ్లుఏది కావాలంటే అది కొనుగోలు చేయవచ్చు. కానీ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు ఏం జరిగింది. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెన్షియన్ మెడల్స్ తప్ప ఇంకేం దొరికేవికావు. ఈ చీప్ లిక్కర్లే వేలకు అమ్మేవారు. దిక్కు లేక…దారిలేక మందుబాబులు అవే కొనుగోలు చేశారు. ఈ తయారీ, రవాణా, అమ్మకం, నగదు లావాదేవీలు మొత్తం ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలే నిర్వహించేవారు. వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు రివర్స్ లో రూ. పది పెంచారని ఆరోపణలు చేస్తున్నారు.
ధరలు సగానికి సగం తగ్గిన విషయం గుర్తుకొస్తుంది !
ఏపీలో ఎన్నికలకు ముందు మద్యం ధర ఎంత ఉండేది ?. ఒక్క క్వార్టర్ బాటిల్ కనీసం 250 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది.. ?. రూ. 99కి కూడా మద్యం అమ్ముతున్నారు. అది కూడా జే బ్రాండ్లు కాదు. బ్రాండెడ్ కంపెనీల మద్యమే. ధరలు సగానికి సగం తగ్గించారు. వచ్చే పాతికేళ్లకు మందుబాబుల్ని తాకట్టు పెట్టి వేలకోట్లు తెచ్చిన జగన్ వాటిని దుర్వినియోగం చేశారు. తమ వారికి వందల కోట్లు బదిలీ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు అంత భారం ఉన్నా ధరలు తగ్గించి మేలు చేశారు.
“మద్య “ తరగతి రక్తం పీల్చడం ఆపేసిన విషయం గుర్తుకొస్తుంది!
మధ్యతరగతి కుటుంబాలల్లో “మద్య” తరగతి ఎక్కువగానే ఉంటుంది. రోజంతా కష్టపడి కాస్త మద్యం తాగడం అలవాటు. అలాంటి వారి రక్తాన్ని జగన్ పీల్చేశారు. అప్పట్లోవారు రోజు వెయ్యి సంపాదిస్తే కనీసం ఐదు వందలు పీల్చేసేశారు. ఇప్పుడు అది వందకే పరిమితం అయింది.అంటే.. “మద్య” తరగతి వర్గానికి నాలుగు వందలకుపైగా రోజుకు మిగులుతున్నట్లే. ఓ కుటుంబానికి అంత కంటే ఏం కావాలి ?, వైసీపీ నేతలు మద్యంపై చిల్లర ఆరోపణలు చేసినప్పుడల్లా సామాన్య ప్రజలకు ఇవే గుర్తుకు వస్తాయనడంలో సందేహం లేదు.