ఆంధ్రప్రదేశ్‌లో .. తెలుగుదేశం పార్టీ నేతల్ని ఆకర్షించేందుకు.. వైసీపీ అయస్కాంతాలను రెడీ చేసుకుంది. చెబుతున్న విలువల ప్రకారం.. ప్రజాప్రతినిధుల్ని కాకుండా… ఏ పదవి లేని వారిని.. చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో.. అక్కడ టీడీపీ నేతలను గురి పెట్టింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నేత అడారి తులసీరావు .. కుమారుడు ఆనంద్, కుమార్తె రమాకుమారి .. జగన్ సమక్షంలో వైసీపీలో చేరి కండువాలు కప్పించుకున్నారు. అడారి ఆనంద్… అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. రమాకుమారి యలమించిలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పని చేశారు. తులసీరావు.. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. ఆయన .. తాను టీడీపీలోనే ఉంటానని.. ప్రకటించారు. ఆర్థిక అవసరాలు.. ఇతర ఒత్తిళ్లతో.. ఆయన కుమారుడు, కుమార్తెను.. వైసీపీలోకి పంపినట్లుగా విశాఖలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే టార్గెట్ చేసిన నేతల ఆర్థిక దిగ్బంధనం…అలా కాకపోతే.. కేసుల చక్ర బంధాలను సిద్ధం చేశారు. కొంత మందిపై యాక్షన్ ప్లాన్ ప్రారంభం కావడంతో… ఆజ్ఞాతంలోకి కూడా పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొంత మంది మాత్రం ఎందుకొచ్చిన తిప్పలని..నేరుగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన వరుపుల రాజా అనే నేత కూడా.. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి… జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ఒక సామాజికవర్గానిదేనని ఆరోపణలు చేసి… జగన్ పై ప్రశంసల వర్షం కురిపించింది. కాపు రిజర్వేషన్లపై జగన్ వైఖరిని సమర్థించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా… ఆయన టీడీపీ తరపున యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఆయన తన నియోజకవర్గంలో… ఇసుక వ్యవహారాల్లో.. నిండా మునిగి ఉండటంతో… ఆ వైపు నుంచి ఒత్తిళ్లు రావడంతో.. టీడీపీకి దూరం కాక తప్పలేదన్న ప్రచారం జరుగుతోంది. మరికొంత మంది నేతలనూ.. వైసీపీ టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇక నుంచి వరుసగా చేరికలు ఉంటాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయా.. లేదా అన్న విషయంపై క్లారిటీలేదు. ప్రస్తుతానికి వైసీపీ విధానం ప్రకారం అయితే.. ఎమ్మెల్యేలు చేరాలంటే పదవిని వదిలి పెట్టుకుని వెళ్లాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపఎన్నికలు తెచ్చిపెట్టుకోవాలనే ఆలోచన… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో… వైసీపీ వేరే ప్లాన్లు ఏమీ లేకపోతే… పదవుల్లేని నేతల్ని మాత్రం..చేర్చుకుని వైసీపీ మరింత బలపడే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.