సోషల్ మీడియాలో వైసీపీ క్షుద్ర రాజకీయం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా విన్యాసాలు ఆ పార్టీని చాప చుట్టేసినా అదే రాజకీయం చేస్తోంది. వ్యక్తులను టార్గెట్ చేసుకొని మూకుమ్మడిగా దాడి చేస్తూ…వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. పరిధి దాటి వ్యక్తిత్వ హననం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరిస్తున్నా వైసీపీ మూకలు అదే పంథాను కొనసాగిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ను వైసీపీ సోషల్ మీడియాతోపాటు మద్దతుదారులు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జగన్ రాప్తాడు పర్యటనలో కొంతమంది పోలీసుల బట్టలూడదీస్తానన్న వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వైసీపీ మూకలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సుధాకర్ యాదవ్ ను చంపుతామని బెదిరించడం, ఎస్సై కుటుంబంపై అనుచిత , అసభ్యకర పోస్టులు పెట్టడం వంటి చేస్తున్నారు.
దీనిపై ఎస్సై సుధాకర్ యాదవ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో ఐడీ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సొంత పార్టీ నాయకుడు కిరణ్ చేబ్రోలుపై కూడా కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసే వారి పట్ల సీరియస్ గా ఉన్నారు చంద్రబాబు. హద్దుమీరి రాజకీయాలు చేస్తే అదే చివరి రోజు అవుతుందని ఇటీవల హెచ్చరించారు. అయినా వైసీపీ అల్లరిమూకల్లో మార్పు రావడం లేదు. ఓ ఎస్సై కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారంటే..ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు సీరియగానే తీసుకుంటారు. చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంటున్నారు.