చిరంజీవి రాజ్య సభ సభ్యత్వం 2018 తో ముగియునుండటం తెలిసిందే. అయితే చిరు సభ్యత్వాన్ని పొడిగించడానికి కావలసిన ఎమ్మెల్యేల సంఖ్య ఏపి కాంగ్రెస్ వద్ద లేదు. కావాలనుకుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దేని నుంచైనా పంపొచ్చు. అప్పట్లో కర్ణాటక కి చెందిన జైరాం రమేష్ ని ఏపి నుంచి రాజ్యసభకి పంపినట్టు చేయొచ్చు. కానీ ఆయా రాష్ట్రాల్లో ఆశావహులు చాలా మంది ఉనారు. సో, చిరు ని మళ్ళీ రాజ్య సభకి పంపడం కాంగ్రెస్ కి అంత సులువు కాదు. సరిగ్గా ఇదే నేపథ్యం లో టిడిపి, వైసిపి లు వాళ్ళ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు.
చిరు సన్నిహితుడు గంటా సాయం తో ఇటు టిడిపి ప్రయత్నిస్తోంటే, అటు వైసిపి మాత్రం చిరంజీవి ని పార్టీ లోకి ఆహ్వానించే విషయమై చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ లండన్ నుంచి రాగానే చిరు ని ఆహ్వానించడం, వీలైతే పవన్ తో కూడ కలిసి పనిచేసే అవకాశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీ ని వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకి ప్రశాంత్ కిషోర్, జగన్ ల మధ్య తొలివిడత చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
కానీ చిరంజీవి ఈ రెండింటిలో దేన్నైనా అంగీకరిస్తాడా అనేది సందేహంగా ఉంది. గతం లో చిరంజీవి మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ ని వదిలేది లేదని స్పష్టం చేసాడు. అయితే అప్పుడు కూడా చిరు బిజెపి కి వెళ్తున్నాడని, రాజ్యసభ తో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేసారనీ వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టడం తో నే చిరంజీవి ఆ తరహా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చిరు తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి పొరపాటు చేసాడనే భావన అభిమానుల్లో ఉంది. మరి, ఈ సారి ఏం చేస్తాడో వేచి చూడాలి.