జగన్ చేసిన మోసాలపై వైసీపీ పోరాటాలు చేస్తోంది. ఇందు కోసం జగనే షెడ్యూల్ ప్రకటించారు. కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. కాస్త సిగ్గుపడే రాజకీయ నాయకుడు అయితే సైలెంటుగా గా ఉంటారు. కానీ సిగ్గుపడితే రాజకీయాల్లో పైకి రాలేమని జగన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ఏ మాత్రం అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా తాను ఐదేళ్లలో చేసిన నిర్వాకాల పాపాలను ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో కడగలేకపోయిందని పోరుబాట పడుతున్నారు.
ఫీజు రీఎంబర్స్ మెంట్ పై వైసీపీ నేతుల రోడ్డెక్కుతారట. ఇప్పుడు కాలేజీలకు ఉన్న బకాయిలన్నీ గత విద్యాసంవత్సరానికి చెందినవి. ఇదిగో ఇస్తున్నాం అని బటన్లు నొక్కి .. అందు కోసం ప్రకటనలు ఇచ్చి వందల కోట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. కానీ ఆ నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇలా మొత్తం మూడు త్రైమాసికాలు ఆపేశారు. ఇప్పుడు ఆ డబ్బులే కాలేజీలు అడుగుతున్నాయి. కాలేజీలను ఈ పథకం నుంచి జగన్ రెడ్డి ఎప్పుడో తప్పించారు. తల్లులను చేర్చారు. ఇప్పుడు వారికి తానివ్వాల్సినవి ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలదేని రోడ్డెక్కుతారట. ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్స్ ను మార్చింది. మళ్లీ కాలేజీల ఖాతాలకు ఇస్తోంది. అందుకే అర్హులైన అంతా రూపాయి కట్టకుండా కాలేజీల్లో చేరిపోయారు.
అలాగే కరెంట్ చార్జీలు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసిన కమిషన్ల దందాతో పెద్ద ఎత్తున ప్రజలపై భారం మోపుతున్నారు. తాను ఉన్నప్పుడే అదనపు చార్జీల అమలుకు ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు అవి అమల్లోకి వస్తే.. మీరు ఆపాలంటూ రోడ్డెక్కుతున్నారు. జగన్ రెడ్డి నిర్వాకాలను చూసి.. వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా రాజకీయం చేయవచ్చా అనుకుంటున్నారు. రేపు లబ్దిదారులు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలో మాత్రం వారికి .. వైసీపీ పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.