వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా ? . ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి ఇప్పటి వరకూ మద్దతుగా ఉంటున్న ఓ బలమైన దక్షిణాది ప్రాంతీయ పార్టీ ఇండియా కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయని అత్యున్నత రాజకీయవర్గాల్లో పుకార్లు గుప్పుమంటన్నాయి. ప్రస్తుతం దక్షిణాది నుంచి సీట్ల పరంగా బలంగా ఉన్న పార్టీలు వైసీపీ, బీజేడీలు మాత్రమే. ఈ రెండు బీజేపీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఒకటి మనసు మార్చుకోవాలనుకుంటోంది.
బీజేడీ – వైసీపీల్లో ఓ పార్టీ ఇండియా కూటమిలోకి !
బీజేడీ .. పార్టీ జాతీయ రాజకీయాలను అసలు పట్టించుకోదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా ఉంటుంది. ఏ కూటముల్లోనూ చేరదు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయదు. అది ఆ పార్టీ విధానం. ఇప్పుడు మార్చుకుంటుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. ఇక మిగిలింది వైసీపీ. ఆ పార్టీకి చాలా అవసరాలు ఢిల్లీతో ముడిపడి ఉన్నాయి. పార్టీతో పాటు పార్టీ అధినేత భవిష్యత్ కూడా ఢిల్లీ ప్రభుత్వంతో ముడి పడి ఉంటుంది. తేడా వస్తే… పార్టీని లేకుండా చేయగలిగేత చాయిస్ కేంద్రంలోని ప్రభుత్వం వద్ద ఉంది.
టీడీపీతో సన్నిహితం.. తమపై విమర్శలతో బీజేపీపై వైసీపీ అనుమానం
ప్రస్తుతం వస్తున్న సర్వేలతో పాటు… ఏపీలో టీడీపీతో బీజేపీ సత్సంబంధాలు కొనసాగిస్తూండటం. తమ పాలనను కీలక నేతలు విమర్శిస్తూండటంతో వైసీపీ నేతల్లో తాము రెండు ప్రధాన కూటములకు దూరం అవుతున్నామేమోనన్న ఆందోళన కనిపిస్తుంది. ఢిల్లీలో తమకు ఎవరూ మద్దతుగా ఉండకపోతే… తమ పరిస్థితి దారుణంగా అయిపోతుందని అనుకుంటున్నారు. బీజేపీని నమ్ముకుని ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీని.. రాహుల్ ను. ..సోనియాను విమర్శించారు. ఇప్పుడు బీజేపీ కూడా డంప్ చేసే పరిస్థితి ఉండటంతో విపక్ష కూటమిలో చేరడం మంచిదన్న ఆలోచనకు వస్ున్నారు.
పీకే ద్వారా చర్చలు – కానీ రివర్స్ ప్రచార వ్యూహం !
జగన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు. వారు చేసే పనుల్ని ఇతర పార్టీలు చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారంలోకి తీసుకురావడం వారి ప్లాన్ , ఇందులో భాగంగా పీకే.. చంద్రబాబుతో భేటీ అయ్యారన్న ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రివర్స్ వ్యూహామని జగన్ రెడ్డి. . ఇండియా కూటమిలో చేరేందుకు పీకే ద్వారా రాయబారాలు నడుపుతున్నారని అందిరకీ ఓ స్పష్టత వచ్చింది . ఇప్పుడు బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది కూడా రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది.