హాఫ్ సెంటిమీటర్.. అంటే… ముల్లు గుచ్చుకున్నంత కూడా కాదు. బియ్యం గింజ ..అదీ కూడా.. బాస్మతి బియ్యం కాదు.. మామూలు బియ్యం గింజ అంత గాయం. విశాఖ ఎయిర్పోర్టులో జగన్కు సానుభూతి తేవాలని.. తను త్యాగం అయిపోవడానికి సిద్ధపడ్డ వీరాభిమాని చేసిన గాయంతో.. జగన్ అయిన గాయం…కచ్చితంగా అంతే. దానికి విశాఖ ఎయిర్పోర్టులో ప్రాథమిక చికిత్స చేసి… యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపేశారు. అంటే.. అది అసలు గాయమే కాదు. కానీ.. విచిత్రంగా హైదరాబాద్కు వెళ్లేసరికి….ఆ గాయం సెంటిమీటరున్నర అయింది. లోపలికి దిగబడిపోయింది. అక్కడ నరాలకు తాకింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చివరికి తొమ్మిది కుట్లు వేయాల్సి వచ్చింది. ఇప్పుడే చెప్పలేము.. మరో రోజు ఆగాల్సిందే అన్నట్లుగా డాక్టర్ శివారెడ్డి మీడియా ముందు అద్భుతంగా వల్లించిన హెల్త్ రిపోర్ట్ చూసి… చాలా మందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
అంత పెద్ద గాయం జగన్ కు అయితే.. అలా అభివాదాలు చేసుకుంటూ.. ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ.. జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చాడన్నది పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీ వెనుక అసలు కథేమిటో చాలా మందికి క్లారిటీ ఉంది. జగన్ మోహన్ రెడ్డి.. విశాఖలో ఫ్లైట్ ఎక్కగానే.. ఢిల్లీలో స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దాని ప్రకారం.. ఎయిర్పోర్టు నుంచి నేరుగా.. హాస్పిటల్ కు వెళ్లాలి. అక్కడ డాక్టర్లు చేయాల్సిన సీన్ క్రియేట్ చేస్తారు. ఈ లోపు.. ఏపీలో.. క్షేత్ర స్థాయిలో కొన్ని గుంపులు చేయాల్సిన పనులు చేస్తాయి. ఇక ఢిల్లీలో ఉన్నవాళ్లు.. దానికి సంబంధించి కొనసాగింపుగా చేపట్టాల్సిన చర్యలను అప్పటికే రెడీ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం జగన్ అలా హాస్పిటల్లో పడుకుని ఉండగానే సాగిపోవాలనుకున్నారు. అందుకే… లేని గాయాన్ని ఉన్నట్లుగా… చూపించి.. ఆపరేషన్లు, కుట్లు అంటూ హడావుడి చేశారనేది వైసీపీ తీరుపై వస్తున్న ప్రధాన ఆరోపణ.
నిజానికి ఆలంటి ప్లానే జరిగి ఉంటే.. అది చాలా తీవ్రమైన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం.. ఏపీని రావణకాష్టంగా మార్చే కుట్ర జరిగిందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తప్పిదం చేశారు. తను కావాలని.. గాయం పెద్దది కాకపోయినా.. నాటకం ఆడినట్లు స్పష్టమవుతోంది. ఆయన.. తన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి.. ఏదో చేయించాలని తాపత్రయ పడ్డ విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఓ బాధ్యత యుతమైన ప్రతిపక్ష నాయకుడుచేయాల్సిన పని మాత్రం అది కాదున్నది చాలా మంది అభిప్రాయం.