లోక్‌సభలో వైసీపీకి 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ల వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న దాఖలాలు లేవు. ఎప్పుడైనా మాట్లాడితే.. మిధున్ రెడ్డి ఒక్కరు మాట్లాడతారు. అందులోనూ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పది శాతం మాట్లాడి.. మిగిలిన 90 శాతం అమరావతి భూముల్లో అక్రమాలు అని.. మరొకటని.. ఏపీలో ఇష్యూస్ గురించి మాట్లాడతారు. అదే సమయంలో… టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు… తమ ఎజెండా ప్రకారం.. అమరావతి, ప్రత్యేకహోదా, విభజన సమస్యలు, బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం సహా… ఇతర అంశాలను లెవనెత్తితే మాత్రం.. ఈ 22 మంది ఎంపీలకు ఒక్క సారిగా చురుకుపుడుతుంది.
నేరుగా.. ఎంపీలు వచ్చి.. ప్రసంగిస్తున్న టీడీపీ ఎంపీలను చుట్టు ముడుతున్నారు. వారి ప్రసంగానికి అడ్డం పడి నినాదాలు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి అదే జరుగుతోంది. సొంత రాష్ట్రానికి చెందిన ఓ ఇష్యూపై .. మరో పార్టీకి చెందిన అయినప్పటికీ.. మాట్లాడేటప్పుడు.. సహకరించడానికి అన్ని పార్టీల ఎంపీలు ప్రయత్నిస్తూ ఉంటారు. సహజంగా అడ్డుకోవడం అనేది ఉండదు. లోక్‌సభలో అందుకున్న భిన్నంగా జరగడం ఇతర రాష్ట్రాల ఎంపీలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైసీపీ ఎంపీల తీరు చూసి… బెంగాల్ ఎంపీలు… ముగ్గురు టీడీపీ ఎంపీలకు మద్దతుగా నిలిచారు.
వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యను ప్రస్తావించరు.. తమను ప్రస్తావించనీయరని.. టీడీపీ ఎంపీలు మండి పడుతున్నారు. 22 మందిని ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపింది… ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపడానికి కాదని… ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంపై పోరాడాలని సూచిస్తున్నారు . ప్రత్యేకహోదాను ఎన్ని రోజుల్లో తెస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి.. వైసీపీ ఎంపీల తీరు మాత్రం… ఢిల్లీలో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.