ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో లుకలుకలు ఎక్కువ అవుతుననాయి. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయుల్ని పార్టీ నుంచి పంపేయాలని దాదాపుగా నిర్ణయిచుకున్నారు. అందు కోసం ప్రణాళిక ప్రకారం ప్రచారం కూడా ప్రారంభించారు. చైతన్య విద్యా సంస్థల యజమాని బీఎస్ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వెళ్లినప్పుడు.. ఎదురుగా ఎంపీ లావు వచ్చారు. ఆయనతో లోకేష్ కరచాలనం చేశారు. అంతే ఆ ఫోటో పట్టుకుని వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. ఆయన పార్టీ మారిపోతారని వచ్చే నెలలో ఓ తేదీ కూడా ఫిక్స్ చేశారు.
వైసీపీలో లావు కృష్ణదేవరాయులు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయనతో సఖ్యతగా లేరు. ముఖ్యంగా మంత్రి విడదల రజనీ ఆయనపై కారాలు మిరాయాలూ నూరుతున్నారు. హైకమాండ్ కు చాలా చెప్పారు. ఆయన నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న చిలుకలూరిపేటకు వెళ్లినా ప్రొటోకల్ మర్యాదలు కూడా దక్కటం లేదు. .అసలు రావొద్దంటున్నారు. ఆ ఒక్కటే కాదు అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. ప్రోటోకాల్ దక్కడంలేదని నేరుగా జగన్ కే చెప్పుకున్నా… పరిస్థితి మెరుగుపడలేదు. అంటే.. ఆయనపై జగన్ కూ ఆసక్తి లేదన్న వాదన వినిపిస్తోంది.
లావు కృష్ణదేవరాయులు .ఇప్పటికే టీడీపీ అధిష్టానం టచ్ లో ఎంపీ ఉన్నారని వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని.. టీడీపీ సోషల్ మీడియా ఎత్తుకుది. .గుంటూరు ఎంపీగా టీడీపీ పార్టీ నుంచి రెండవసారీ విజయం సాధించిన గల్లా జయదేవ్ సైలెంట్ అయ్మారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు…పార్టీ కూడా జయదేవ్ స్థానంలో మరో అభ్యర్థి కోసం చూస్తోంది. ఆ అభ్యర్థి లావు అవుతారని అంటున్నారు. కానీ గల్లా జయదేవ్ కాకపోతే అలాంటి పొటెన్షియల్ ఉన్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారని టీడీపీ నేతలంటున్నారు.