పది శాతం మద్యం దుకాణాలను బీసీ వర్గాలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా వేలం వేసిన దుకాణాల్లో పది శాతాన్ని మినహాయించారు. ఇప్పుడు మిగిలిన వాటిని బీసీ కులాలకు కేటాయించేలా ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఆ దుకాణాలను వారికి కేటాయించవద్దంటూ వైసీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పిటిషన్లు వేశారు. ఇందులో లాయర్లతో పాటు లాటరీలో షాపులు దక్కించుకున్నారు దుకాణయజమానులు కూడా ఉన్నారు. దాదాపుగా 30 పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కేటాయింపులు ఆపుతూ నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
విధానపరమైన నిర్ణయాలను ఎలా అడ్డుకుంటామని హైకోర్టు ప్రశ్నించింది. అయితే తమకు నష్టం జరుగుతోదంని..బీసీ వర్గాలకు తక్కువ ధరలు నిర్ణయించారని వారు ఆరోపిస్తున్నారు. వారికి ఎలాంటి అన్యాయం చేయబోమని ప్రభుత్వం చెప్పి.. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానానికి చెప్పింది. బీసీ వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి అవకాశం కల్పించాల్సి ఉంది. అలాంటి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలను వైసీపీ పిటిషన్ల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడంపై బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వైసీపీ ప్రతిపక్షంలోఉంటే.. ఆ పార్టీ చేసే పోరాటం అంతా.. ప్రభుత్వం చేసే పనుల్ని అనుచిత పనుల్ని అడ్డుకోవడంలోనే ఉంటుంది. కోర్టుల్లో పిటిషన్లు.. ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేస్తూ.. ఏపీకి రావాల్సిన సాయాన్ని అడ్డుకుంటూ ఉంటారు. పనులు జరగుకండా చేసి ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దన్న అభిప్రాయం టీడీపీ క్యాడర్ లో వినిపిస్తోంది.