ఐ ప్యాక్ టీమ్ సర్దేసుకుందని చాలా మంది అనుకుంటున్నారు కానీ అది నిజం కాదని ఇటీవల వైసీపీ డ్రామాలు చూసి సామాన్య జనానికీ అర్థమైపోయింది. వైసీపీ క్యాడర్ కూ స్పష్టత వచ్చింది. ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ ను ముందే వదిలించుకోవాల్సింది పోయి..ఆయనదేమీ లేదని ఆత్మవంచన చేసుకుని ఆ టీమ్ తో పని చేయడంతో ఘోర పరాజయం ఎదురయింది. ప్రతీది డబ్బులతో కొలుచుకునే ఐ ప్యాక్ టీం.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టోపీలు, స్టిక్కర్లు పేరుతో కూడా డబ్బులు దండుకుంది. ఇప్పుడు జగన్ ఆ సంస్థను వదిలి పెట్టలేదని తాజాగా సమాచారం వెలుగులోకి వస్తోంది.
అయితే ఆ టీం గతంలోలా నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పటికి అయితే కేవలం జగన్ డ్రామాలకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, యాక్టర్లను రెడీచేస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి బలం సానుభూతి కాబట్టి ఆ దిశగా కొన్ని కథలు, సీన్లు వండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందు కోసం ఐ ప్యాక్ టీం పూర్తిగా ఉన్నతస్థాయి వర్గాలతో టచ్ లో ఉండి పనులు చేస్తోంది. గతంలో ప్రతీ నియోజకవర్గంలోనూ ఐ ప్యాక్ టీం ఉండేది. దాని వల్ల నేతల్లోనూ అసంతృప్తి పెరిగిపోయింది. చివరికి పుట్టి మునిగింది.
ఇప్పుడు కూడా జగన్ ఐ ప్యాక్ డ్రామాలనే నమ్ముకోవడంపై నేతలు అసహనంతో ఉన్నారు. ప్రజల్ని ఎల్ల కాలం మాయ చేయలేమని కాస్త రియాలిటీ రాజకీయాలు చేయాలన్న అభిప్రాయానికి వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి తన మీద నమ్మకం లేదు. డ్రామాలు ఆడితే తప్ప ప్రజలు నమ్మరని అనుకుంటున్నారు. అదే కొనసాగిస్తున్నారు.