చివరి అసెంబ్లీ సమాశాలు జరిగాయి. మామూలుగా అయితే అధికార పార్టీలో ఫుల్ జోష్ ఉండాలి. మళ్లీ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ చూపించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ వైసీపీలో మాత్రం ఇక సినిమా అంతా అయిపోయిందన్న భవనకు వచ్చేసినట్లుగా వ్యవహరించారు. నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీలో ఎక్కడా కాన్ఫిడెన్స్ కనిపించలేదు సరి కదా.. చివరికి గ్రూప్ ఫోటోకు కూడా ముందుకు రాలేకపోయారు. ఈ పరిస్థితి చూసి టీడీపీ నేతలు కూడా ముందే కాడిపడేశారని సెటైర్లు వేసుకున్నారు.
అసెంబ్లీలో వైసీపీకి ఏకపక్ష మెజార్టీ ఉంది. 156 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు ఉన్నారు. కానీ ఏ రోజూ కూడా 70 మందికి మించి ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. రాజ్యసభ ఎన్నికల మాక్ పోలింగ్ నిర్వహిద్దామనుకుంటే.. ఎవరూ రారని క్లారిటీ రావడంతో ఆగిపోయారు. నిజానికి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ క్లిష్టం. రెండు, మూడు సార్లు ప్రాక్టిస్ చేస్తేనే .. కరెక్ట్ గా ఓటేయగలుగుతారు. అలాంటిది మాక్ పోలింగ్ పెడితే ఎమ్మెల్యేలు రాకపోతే సమస్య అని పెట్టలేకపోయారు.
అత్యధిక మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్ ఇస్తారని.. ఇచ్చినా గెలుస్తారన్న నమ్మకం లేకపోయింది. గతంలో ఓవరాక్షన్ చేసిన వాళ్లు కూడా ఈ సారి చల్లబడిపోయారు. అనవసరంగా రెచ్చిపోవడం వల్ల వచ్చేదేమీ లేకపోవడం వల్ల శత్రువుగా మారే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీలో ఓటమి చాయలు చివరి అసెంబ్లీ సమావేశాల్లోనే బయటపడ్డాయి.