తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు కొత్త ఈవో శ్యామలరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు, సీఎం చంద్రబాబు మొదటి మిషన్‌గా టీటీడీ ప్రక్షాళనే చేపట్టారు. ధర్మారెడ్డిని సెలవుపై పంపి ఈవోగా శ్యామలరావును నియమించారు. వెంటనే బాధ్యతలు తీసుకున్న ఆయన వైసీపీ గత ఐదేళ్లుగా ఇంజెక్ట్ చేసిన వైరస్ ను క్లీన్ చేసే పనిలో పడ్డారు.
జగన్ గెలిచినప్పుడు ఢిల్లీలో రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డి టీటీడీలో చేరిపోయారు. అప్పట్నుంచి కొండపై పెత్తనం అంతా ఆయనదే. ప్రతి విభాగంలోనూ అనధికారిక సలహాదారులు చేరిపోయి మొత్తం గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన చేశారు. కొండపై భక్తులకు కనీస సౌకర్యాలు అందకుండా పోయాయి. మంచి నీళ్లు కూడా యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి. క్యూలైన్లలో గతంలో పాలు ఇచ్చేవారు. ఇప్పుడు మంచినీనీళ్లు కూడా ఇవ్వడం లేదు. క్యూ కాంప్లెక్స్ లో దగ్గరకు వచ్చి చిప్స్ ప్యాకెట్లు యథేచ్చగా అమ్ముకుంటారు. కానీ దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మంచినీళ్లు అయినా ఇచ్చే ఆలోచన మానేశారు.
ఇక దర్శనాలు మొత్తం గందరగోళం. టిక్కెట్లు ఆన్ లైన్ విడుదల చేస్తారు. ఎటు పోతాయో తెలియదు. టీటీడీకి ఉచితంగా సేవలు అందించేందుకు ఎన్నో సాంకేతిక సంస్థలు వస్తాయి కానీ.. టిక్కెట్ల బుక్కింగ్ ..ధర్డ్ పార్టీకి ఇచ్చేశారు. ఇక కొండపై వైసీపీ నేతలే వ్యాపారాలను కబ్జా చేశారు. అవుట్ సోర్సింగ్ పేరుతో తమ వారిని ఉద్యోగాల్లో చేర్పించేశారు. జంబో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసి దర్శన వ్యాపారం పెంచారు. శ్రీవాణి టిక్కెట్ల పేరుతో భక్తులని నిలువు దోపిడీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొండపై ఉన్న వైరస్ అంతా ఇంతా కాదు.
ఇక నిధుల దుర్వినియోగం గురించి వచ్చిన ఆరోపణలు అన్నీ అన్నీ కావు. చివరిలో టీటీడీ చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డినే వెయ్యి కోట్ల పనులకు టెండర్లు ఇచ్చి … బిల్లులు చెల్లించి కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ధర్మారెడ్డి చేసిన నిర్వాకాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వైరస్ అంతటికిని శ్యామలరావు క్లీన్ చేసి… స్వచ్చ తిరుమలను భక్తుల ముందు పెట్టాల్సి ఉంది.