వైసీపీ నేతల విశాఖ గర్జనకు ప్రకృతి కూడా సహకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఉదయానికి కూడా తెరిపినివవ్వలేదు. అదే సమయంలో పార్టీ నేతలు కూడా ఎవరూ జన సమీకరమపై దృష్టి పెట్లలేదు. ఖర్చు లేకుండా ఉండేలా డ్వాక్రా మహిళల్ని.. స్కూల్ విద్యార్థుల్ని తీసుకొచ్చి ర్యాలీని మమ అనిపించారు. నిజంగా వైసీపీ నేతలు చేసిన హడావుడికి.. విశాఖ గర్జనలో కనిపిచిన జనానికి పొంతన లేకుండా పోయింది .పట్టుమని వెయ్యి మందిని కూడా పోగేయలేని పరిస్థితి కనిపించింది. తమ మూడు రాజధానుల వాదనతో ఎవరినీ ఎట్రాక్ట్ చేయలేకపోయారని ఈ ర్యాలీతో వైసీపీ వాళ్లే నిరూపించాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి.
ఇక వైసీపీ నేతల ఆరివీర ప్రసంగాలకు అయితే కొదవ లేదు. రెచ్చగొట్టడం తన జన్మహక్కని అనుకుంటారు .ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టాలనుకున్న వారందరూ… సీమ, కోస్తా నేతలు. రోజా, సుబ్బారెడ్డి, జోగిరమేష్ లాంటి వాళ్లు వచ్చి.. ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోతున్నట్లుగా మొసలి కన్నీరు కార్చారు. కానీ విశాఖలో భూదందాలపై ఒక్కరూ మాట్లాడలేదు. వారి ప్రసంగాలు వినడానికి కూడా చివరికి మనుషులు మిగల్లేదు.
అదే సమయంలో జనవాణి కోసం పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్న విషయం హైలెట్‌గా మారింది. ఉదయం వైసీపీ నేతల గర్జనకు వచ్చినదాని కన్నా రెండింతలు పవన్‌కు స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయానికి జనం వచ్చారు. ఖచ్చితంగా వారు వెళ్లే సమయంలోనే పవన్ వచ్చారు. ఆ సమయంలో వారిని అక్కడ చూసిన జనసైనికులు కంట్రోల్ కోల్పోయారు. రాళ్ల దాడి చేశారు. పవన్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల కారణం ఏర్పడిన కోపం వారు ఎదురుగా కనిపించగానే బయటపడింది. వారు అధికారంలోఉన్నారు కాబట్టి సరిపోయింది లేనప్పుడు వారు జనసైనికులు ఇలా ఎదురు పడితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని.. వారిలో అంత అసహనం గూడు కట్టుకుపోయిందని.. ఆ పరిణామాలతో స్పష్టమయింది.
విశాఖ గర్జన వైసీపీ నేతలకు నిరాశ కలిగించింది. తమ మూడు రాజధానుల వాదన.. ప్రజల్లోకి వెళ్లడంలేదని.. కోపం వారిలో కనిపిస్తుంది. ముందు ముందు ఏం చేస్తారో కానీ.. ఈ రోజు గర్జన మాత్రం తేలిపోవడం వారికిషాకచ్చినట్లయింది.