వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏపీ సీఐడీ ఎంత త్వరగా అరెస్టు చేయాలా అని ఎదురు చూస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు ఢిల్లీకి ఏపీ సీఐడీ బృందాలు వెళ్లాయని ప్రచారం ప్రారంభించింది వైసీపీ. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకూ మద్యం స్కాం కేసులో సీఐడీ అరెస్టుల వరకూ వెళ్లలేదు. నిందితులకు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోనిస్తున్నారు. హడావుడి అరెస్టులు చేయలేదు.
ఇప్పుడు కూడా రాజ్ కసిరెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు మిథున్ రెడ్డికీ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై స్పష్టత లేదు. రాజ్ కసిరెడ్డి మాత్రం నోటీసులు జారీ చేసినా ..లిక్కర్ స్కాంకు, తనకు ఏం సంబంధం లేదని వాదిస్తూ విచారణకు రావడం లేదు. ఇప్పుడు ఆయన పిటిషన్ లను హైకోర్టు కొట్టి వేయడంతో ఆయన హాజరు కాక తప్పదు. హాజరు కాకపోతే సీఐడీ అధికారులు ముందుగా రాజ్ కసిరెడ్డినే అరెస్టు చేస్తారు.
మిధున్ రెడ్డిని అరెస్టు చేయాలని వైసీపీ నేతలు ఎందుకు అంత తాపత్రయపడున్నారో కానీ.. ఒక వేళ అలాంటిదేదైనా జరిగితే వైసీపీ స్టైల్లో ఉండదని..చట్టబద్ధంగా ఉంటుందని టీడీపీ నేతలంటున్నారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి మాత్రమే కాదు అంతిమ లబ్దిదారు కూడా అరెస్టవుతారని అంటున్నారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ ద్వారా ఏదైనా రచ్చ చేయవచ్చని వైసీపీ ప్లాన్ చేసుకుందేమో కానీ.. ముందుగా ఆయనను అరెస్టు చేస్తే బాగుండని అనుకుంటోంది.