అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. అధికారుల్ని బలి చేస్తున్న జగన్ నిర్వాకం కళ్ల ముందు ఉంటే.. కొత్తగా కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వాళ్లు … అధికారులు ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా… వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మేమొచ్చాక అంతు చూస్తామని హెచ్చరించడం ప్రారంభించారు. ఇలా హెచ్చరించేటప్పుడు వాయిస్ లో బేస్ కూడా ఉండటం లేదు. కీచుగొంతుతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వైసీపీ వస్తుందో రాదో తర్వాత సంగతి ముందు ఐదేళ్ల పాటు తమను తాము రక్షించుకోవడానికి బెదిరింపులకు దిగుతున్నారు. జమిలీ ఎన్నికలు రెండేళ్లు ముందే వస్తాయన్న ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
ఎన్నికలు ఎంత ముందు వస్తే వైసీపీకి మరోసారి అధికారం అంత దూరం అవుతుందనే విషయాన్ని వైసీపీ కన్వీనియంట్ గా మర్చిపోయినట్లుగా నటిస్తోంది. కానీ వైసీపీకి ఎన్నికలు అంటే ఎంత కష్టమో తెలుసు. కానీ అధికారుల్ని బెదిరించడానికి మాత్రం వెనుకాడటం లేదు.
టీడీపీ పాలనలో తప్పు చేయాలని అధికారుల్ని ఎవర్నీ ఒత్తిడి చేయడం లేదు. సాక్ష్యాలు ఉన్న కేసుల్లోనే్ జైలుకు పంపుతున్నారు. అన్నీ నిబంధనల ప్రకారం చేసినా అధికారులపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదని .. ఎంత అధికార దుర్వినియోగం చేసినా వ్యవస్థు ఉంటాయన్న సంగతిని పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నాయి. అయినా వైసీపీ నేతలకు కనీసం ఒక్కరైనా అధికారి భయపడితే తాము బయటపడవచ్చని అనుకుంటున్నారు.