వైసీపీ అంటే నేతలతో పాటు క్యాడర్ కూడా. కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ ఉండదు. కానీ విచిత్రంగా సీఎం జగన్ మాత్రం దీన్ని పెద్దగా నమ్మడం లేదు. ఆయన వైసీపీ అంటే పూర్తిగా ఐ ప్యాక్ అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష చేయకుండా.. ఐ ప్యాక్ టీంతో మాట్లాడారు. ఎందుకిలాంటి ఫలితాలు వచ్చాయని నిలదీశారు. ఐ ప్యాక్ టీమే ఈ విషయాలను లీక్ చేస్తోంది.
సీఎం జగన్ పూర్తిగా ఐ ప్యాక్ ను నమ్ముకున్నారు. వారు ఎలాంటి సలహాలిస్తే దాన్నే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కు జరిగి నఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని ప్రైవేటు టీచర్లను ఓటర్లుగా చేర్చడంతో గెలవవొచ్చని… యువత పూర్తిగా తమవైపు ఉంటుందని నివేదికలు ఇచ్చారు. దీంతో అన్ని స్థానాల్లో గెలుస్తామని జగన్ నమ్మారు. కానీ ఫలితాలు తేడా కొట్టాయి. దీంతో ఐ ప్యాక్ ప్రతినిధులతో జగన్ మండిపడ్డారని చెబుతున్నారు. ఇంత చిన్న ఎన్నికను కూడా మేనేజ్ చేయలేకపోతే మీ వ్యూహాలు ఎందుకని ఆయన అనడంతో వారు షాక్ అయ్యారు.
ముఖ్యంగా పట్టభద్రులు ఆగ్రహంలో ఉన్నారని, వారిని ఆకట్టుకునేందుకు ఏదోటి చేయాలన్న ఆలోచన ఐప్యాక్ టీం రాకపోవడం పెద్ద మైనస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచే స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయడంలో ఐప్యాక్ ఫ్లాపైంది. దానితో బోర్లా పడి, మూడు ఎమ్మెల్సీల్లో ఘోరపరాజయం మూటగట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలు తప్పితే, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారని జగన్ ప్రశ్నించడంతో వారికి నోట మాట రాలేదని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ విజయాలను టీడీపీ సోషల్ మీడియా పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. రాష్ట్రం నలుమూలలా వైసీపీ పనైపోయిందని ప్రచారం చేస్తోంది. దీనికి వైసీపీ వద్ద కౌంటర్ లేదు.