షర్మిలపై మొహమాటాలు పెట్టుకోవద్దని వైసీపీ నిర్ణయించుకుంది. షర్మిల ఇలా బాధ్యతలు తీసుకోగానే అలా వైసీపీ తమ పాలసీని అమలు చేయడం ప్రారంభించడమే దీనికి సంకేతం. .అమెరికాలో ఉండే ఓ వెటర్నరీ డాక్టర్ తో షర్మిల కుటుంబంపై దారుణమైన నిందలతో విరుచుకుపడేలా చేయడమే కాకుండా వాటిని వైసీపీ సోషల్ మీడియా సర్క్యూలేట్ చేయడం దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ సోషల్ మీడియా పే రోల్స్ లో ఉండే అనేక మంది బూతులతో విరుచుకుపడ్డారు. వారికి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అలాంటి కామెంట్లు పెట్టే చాన్స్ లేదు.
షర్మిల రాజకీయంగా విమర్శలు చేశారు. ఉద్యోగాలు, అభివృద్ధి, రాజధానుల గురించి మాట్లాడారు. జగన్ రెడ్డి క్రిస్టియన్ అయి ఉండి.. మణిపూర్ గురించి మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు. చేతనైతే వీటిపై సమాధానం ఇవ్వాలి కానీ.. షర్మిలను వ్యక్తిగతంగా ఆమె ఇప్పుడు చంద్రబాబు బాణమన్నట్లుగా ప్రచారం చేసే వ్యూహంలోకి వెళ్లిపోయారు. అసలు వైసీపీ విధానమే ఇది. వారు .. తమ పాలసీల్ని సమర్థించుకోలేరు. అందుకే ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత, వ్యక్తిత్వ దాడులకు దిగుతారు. ఇప్పుడు షర్మిల పైనా అదే పాలసీ అమలు చేస్తున్నారు.
మహిళల పట్ల కాదు… చివరికి చెల్లి పట్ల కూడా జగన్ రెడ్డికి ఇసుమంత అభిమానం లేదని నిన్నటి పరిణామాలతో సజ్జల రెడ్డి స్పందన..ఆయన కుమారుడి సోషల్ మీడియా స్పందనతో మొత్తం తేలిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. షర్మిల విషయంలో మొహమాటాలు పెట్టుకోవద్దని అందరి నేతల్లాగానే ఆమెపై దాడిచేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. దీంతో షర్మిలపై వైసీపీ వైపు నుంచి మరింతగా ఎటాక్ జరిగే అవకాశం ఉంది.