ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే రోజు ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వంలో భాగం చేసింది. ఇందులో ఒకరు ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన డీజీపీ కావాల్సిన పోలీస్ ఆఫీసర్ ను ఐదేళ్ల పాటు సస్పెన్షన్ లో ఉంచింది వైసీపీ ప్రభుత్వం. ఎవర్నీ వదిలి పెట్టను అని గతంలో ఆయన చాలెంజర్ చేశారు. ఇప్పుడు ఆ చాలెంజ్ ఆయనకు గుర్తు ఉందో లేదో కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆయనకు న్యాయం చేసింది. అభియోగాలు అన్నీ ఉపసంహరించుకుని ..తాజాగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. అంటే పోలీసు వ్యవస్థలో ఆయన భాగం అయ్యారన్నమాట.
ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చిన కాసేపటికే మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు సలహాదారు పదవి ఇచ్చారు. ఏ విషయంలో సలహాలు ఇస్తారో కానీ.. ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన చంద్రబాబు హయాంలో 11 నెలలు డీజీపీగా పని చేశారు కూడా. వైసీపీ వచ్చాక పక్కన పెట్టారు. చివరికి రిటైర్మెంట్ అయ్యాక ఢిల్లీలో ఉంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏపీకి సలహాలివ్వబోతున్నారు. ఆర్పీ ఠాకూర్ , ఏబీవీ జోడి అంటే వైసీపీ నేతలకు చాలా భయం ఉంది. పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. వీరిద్దరూ వైసీపీ బాధితులే కావడం.. మళ్లీ ప్రభుత్వంలోకి రావడం.. వారికి ఉపాధి కల్పించడానికే కాదు.. అంతకు మించిన వ్యూహం ఉందని టీడీపీ వర్గాలు కూడా అనుకుంటున్నాయి.
ఇప్పటి వరకూ పోలీసింగ్ జరుగుతోంది కానీ టీడీపీ కార్యకర్తలు ఆశించినట్లుగా కాదు. ఇక ముందు ఏబీవీ, ఆర్పీ ఠాకూర్ సలహాలతో అంతా అనుకున్నట్లుగా జరిగిపోతుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. వైసీపీ నేతలకూ ఇదే భయం పట్టుకుంది. ఇప్పటి వరకూ ఎలా ఉన్నా.. ఇక ముందు జాగ్రత్తగా ఉండాల్సిందేనని అనుకుంటున్నారు. ఆర్పీఠాకూర్ ఢిల్లీ నుంచే పని చేయబోతున్నారు.