లోకేష్‌కు కేంద్రం జడ్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్ బలగాలు లోకేష్‌కు సెక్యూరిటీగా వచ్చాయి. సీం జగన్ కన్నా ఇప్పుడు లోకేష్ కు ఎక్కువ సక్యూరిటీ ఉంది. దీంతో వైసీపీ నేతలకు కడుపు మండిపోతున్నట్లుగా ఉందేమో కానీ వరుసగా మీడియా ముందుకు వచ్చి మాకే గన్మెన్లు లేరు.. లోకేష్‌కు జడ్ సెక్యూరిటీనా అని వాపోవడం ప్రారంభించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరింత ఎక్కువగా మథనపడ్డారు. తాను ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా చేశానని తనకే గన్‌మెన్ లేరని .. లోకేష్‌కు జడ్ కేటగిరీనా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ కోసమే.. పొత్తులు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఇతర వైసీపీ నేతలదీ అదే బాధ. అయితే లోకేష్‌కు సెక్యూరిటీ పొత్తులు పెట్టుకున్నంత మాత్రానే కల్పించరని ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సూచనల మేరకే కల్పించి ఉంటారనేది ఈ విషయంలో కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది.
ఎన్నికల ప్రచారంలో లోకేష్‌కు ముప్పు తలపెట్టాలన్న కుట్రలు జరిగి ఉంటాయని.. వాటిపై సమాచారం.. కేంద్రానికి తెలియడంతోనే భద్రత కల్పించి ఉంటారని భావిస్తున్నారు. స్టైలిష్ సెక్యూరిటీ కోసం సీఎం జగన్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి కూడా ముప్పు ఉందని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులతో చెప్పించారు. అయినా కేంద్రదం పట్టించుకోలేదు. వారి ఇన్ పుట్స్ వారికి ఉంటాయి. ఇప్పుడు లోకేష్‌కు సెక్యూరిటీ కల్పించడంతో.. వైసీపీకి తమ ప్లాన్ ఏదో బెడిసికొట్టిందన్నట్లుగా మథనపడుతున్నారు.